మీ నాయకత్వంలోని సాధకులకు అభినందనలు.. ఆర్ఎస్పీ ట్వీట్ కు కేటీఆర్ ప్రశంసలు

by Ramesh Goud |
మీ నాయకత్వంలోని సాధకులకు అభినందనలు.. ఆర్ఎస్పీ ట్వీట్ కు కేటీఆర్ ప్రశంసలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మీ నాయకత్వంలో తెలంగాణ సాంఘీక సంక్షేమ వవస్థ గర్వపడేలా చేశారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. ప్రవీణ్ కుమార్ చేసిన ట్వీట్ కు కేటీఆర్ స్పందిస్తూ.. స్వేరోకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన సేవలను కొనియాడారు. కేటీఆర్ ఈ అద్భుతమైన పిల్లలు పూర్ణ, ఆనంద్ ప్రవీణ్ గారి నాయకత్వంలో తెలంగాణ సాంఘీక సంక్షేమ వ్యవస్థ గర్వపడేలా చేశారని, అసమానతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి రాణించిన అద్భుతమైన సాధకులకు అభినందనలు తెలిపారు.

కాగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ లో స్వేరో కిడ్స్ ర్యాలీ నిర్వహించి స్వేరో జెండాను ఎగరేస్తున్న వీడియోను పోస్ట్ చేశారు. దీనిపై స్వేరో పిల్లలు పూర్ణ, ఆనంద్ లు శక్తివంతమైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి నేటికి 11 వసంతాలు పూర్తి చేసుకుందని, వారి ఘనతకు గుర్తుగా స్వేరోలందరూ మే 25ను స్వేరో విక్టరీగా జరుపుకుంటారని, ఈ రోజున పిల్లలు ఏదైనా కొండ ప్రాంతం లేదా ఏదైనా ఎత్తైన ప్రదేశానికి వెళ్లి స్వేరో జెండాను ఆవిష్కరిస్తారని తెలిపారు. అలాగే స్వేరో అయినందుకు గర్వంగా ఉంది అని ఆర్ఎస్పీ ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు.

Next Story

Most Viewed