- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బండి భగీరథ్ లొంగిపోయాడా? పోలీసులే అరెస్ట్ చేశారా?
పోక్సో కేసులో బండి భగీరథ్ లొంగిపోయారా లేక పోలీసులే అరెస్ట్ చేశారా అన్నదానిపై సస్పెన్స్ నెలకొంది.

దిశ, వెబ్‌డెస్క్: మైనర్ బాలికను లైంగికంగా వేధించిన కేసులో బండి భగీరథ్ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు కొద్దిసేపటి క్రితం వార్తలొచ్చాయి. అయితే.. చట్టానికి లోబడి తన కుమారుడిని లాయర్ల సమక్షంలో పోలీసులకు అప్పగించానని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ తెలిపారు. చట్టం అందరికీ ఒక్కటేనని, న్యాయం జరుగుతుందన్న ఆశ ఉందని పేర్కొన్నారు. అయితే.. పోలీసులు మాత్రం బండి భగీరథ్ ను తామే అరెస్ట్ చేసినట్లు చెప్తున్నారు.
పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ ను నార్సింగిలో పోలీస్ అకాడమీ వద్ద అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ సీపీ రమేష్ రెడ్డి చెప్తున్నారు. అక్కడి నుంచి భగీరథ్ ను పేట్ బషీరాబాద్ పీఎస్ కు తరలించారు. భగీరథ్ అరెస్టుతో.. కూకట్ పల్లి డీసీపీ రితిరాజ్ హుటాహుటిన పేట్ బషీరాబాద్ పీఎస్ కు చేరుకున్నారు. మరోవైపు ఈ కేసుపై సీఎం ఆదేశాల మేరకు డీజీపీ సీవీ ఆనంద్ ఇటీవలే సిట్ ను ఏర్పాటు చేశారు. కుమారుడిని తామే అప్పగించామని బండి సంజయ్ చెప్తుండగా.. అరెస్ట్ చేశామని పోలీసులు అంటున్నారు. దీంతో భగీరథ్ లొంగిపోయారా? లేక పోలీసులకు దొరికిపోయారా? అన్నవిషయం సందిగ్ధంగా మారింది.
చట్టంపై గౌరవంతో అప్పగించా : భగీరథ్ సరెండర్ పై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందన






