- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శాసనమండలిలో గందరగోళం.. చర్చ లేకుండానే పలు బిల్లులకు ఆమోదం
కాళేశ్వరం (Kaleshwaram)పై విచారణను సీబీఐ (CBI)కి అప్పగిస్తున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో శాసన మండలిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం (Kaleshwaram)పై విచారణను సీబీఐ (CBI)కి అప్పగిస్తున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో శాసన మండలిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాళేశ్వరం రిపోర్టును సీబీఐకి ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. ఏకంగా చైర్మన్ పోడియం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అందుకు పోటీగా అధికార పార్టీ సభ్యులు కూడా నినాదాలు చేశారు. దీంతో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukhender Reddy) సభ్యులను వారి వారి స్థానాల్లోకి వెళ్లాలని పదే పదే విజ్ఞప్తి చేశారు. అయినా.. బీఆర్ఎస్ సభ్యులు వినకపోవడం చైర్మన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మధ్యలో మంత్రి పొన్నం ప్రభాకర్ కలుగజేసుకుని స్థానిక సంస్థల్లో 42 బీసీ బిల్లును ప్రవేశపెడుతుండగా అందుకు వారు అడ్డుకున్నారు.
ఈ నేపథ్యంలోనే ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలు ఎవరూ సమగ్ర సర్వేలో పాల్గొనలేదని.. కడుపులో కత్తులు పెట్టుకుని మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కూడా 42 శాతం రిజర్వేషన్‌కు మద్దతు ఇవ్వాలని బిల్లును ప్రవేశపట్టారు. అయితే, బీఆర్ఎస్ ఆందోళన మధ్య ఎలాంటి చర్చ లేకుండానే బీసీ రిజర్వేషన్ బిల్లు (BC Reservation Bill) ఆమోదం పొందింది. అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలో ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీల ఏర్పాటు, ఇస్నాపూర్ మున్సిపాలిటీ విస్తరణ చేస్తూ మంత్రి సీతక్క ప్రవేశపెట్టిన తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లు, మంత్రి దామోదర రాజనర్సింహ ప్రవేశపెట్టిన అల్లోపతిక్ బిల్లులను ఏకగ్రీవంగా శానసమండలి ఆమోదించింది. అనంతరం చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సభను నిరవధికంగా వాయిదా వేశారు.






