Court Exam: హైకోర్టు పరీక్షలో కంప్యూటర్ల మొరాయింపు? సెంటర్ వద్ద అభ్యర్థుల గందరగోళం

by Ramesh Naini |

తెలంగాణ హైకోర్టు (High Court exam) పరీక్షల్లో గందరగోళం నెలకొన్నట్లు సమాచారం.

Court Exam: హైకోర్టు పరీక్షలో కంప్యూటర్ల మొరాయింపు? సెంటర్ వద్ద అభ్యర్థుల గందరగోళం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ హైకోర్టు (High Court exam) పరీక్షల్లో గందరగోళం నెలకొన్నట్లు సమాచారం. ఆదివారం వందలాది మంది పరీక్ష రాసేందుకు చేరుకున్నా.. టెక్నికల్ సమస్య కారణంగా కంప్యూటర్‌లు మొరాయిస్తుండడంతో ఉదయం 11 గంటలకు జరగాల్సిన పరీక్షకు ఆలస్యం అయినట్లు తెలిసింది. హైదరాబాద్‌ అబిడ్స్ కాలేజీలో స్టాన్లీ కాలేజీలో టెక్నికల్ సమస్య కారణంగా గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో అభ్యర్థుల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. అలాగే సెంటర్ వద్ద కనీస సౌకర్యాలు లేకపోవడంతో జిల్లాల నుంచి వచ్చిన వికలాంగ, మహిళ లకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఘటన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

కాగా, తెలంగాణలో 1673 కోర్టు ఉద్యోగాలకు సంబంధించి పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఎగ్జామినర్‌, జూనియర్‌ అసిస్టెంట్, ఫీల్డ్‌ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, కాపీయిస్ట్‌, సబ్-ఆర్డినేట్‌ సర్వీస్ ఉద్యోగాలకు ఏప్రిల్ 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు షిఫ్ట్‌ల ప్రకారం పరీక్షలు జరుగుతున్నాయి. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, మెరిట్ లిస్ట్, స్కిల్ టెస్ట్, షార్ట్ హ్యాండ్‌ ఇంగ్లిష్‌, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Next Story