- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sarpanch Elections: ఏ గ్రామంలో ఎప్పుడో క్లారిటీ
by Gantepaka Srikanth |
తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించింది. మంగళవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఈ మేరకు వివరాలు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,728 సర్పంచ్ స్థానాలకు, 1,12,242 వార్డు స్థానాలకు మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు చెప్పారు. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి, అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నియమావళి మంగళవారం నుంచే అమల్లోకి వచ్చిందని రాణి కుముదిని స్పష్టం చేశారు. ఏ గ్రామంలో ఎప్పుడు ఎన్నికలు ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ లింక్‌ను క్లిక్ చేయండి.
Next Story






