- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా జీవితంలో మరువలేని సందర్భాలివే.. టీపీసీసీ చీఫ్‌గా మూడు వసంతాలు పూర్తి: సీఎం
నేటితో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించి మూడు వసంతాలు పూర్తయ్యాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: నేటితో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించి మూడు వసంతాలు పూర్తయ్యాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నాడు తనపై ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన సోనియాగాంధీ, కాంగ్రెస్ అగ్రనేతలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికగా ఆసక్తికర ఫోటోలు పంచుకున్నారు.
పీసీసీ అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించడం, సోనియా గాంధీ సారథ్యంలో విజయ భేరి సభ నిర్వహించడం, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం మూడేళ్లలో ఈ మూడు ఘట్టాలు తన జీవితంలో మరువలేని సందర్భాలని పేర్కొన్నారు. ఈ ప్రస్థానంలో తనకు సహకరించిన పార్టీ సీనియర్ నేతలకు, పార్టీ అధికారంలోకి రావడానికి కఠోర శ్రమ చేసిన లక్షలాది మంది కార్యకర్తలకు, కాంగ్రెస్ ను గెలిపించి ప్రజా పాలనకు నాంది పలికిన నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.






