క్రీడాకోట నియామకాల కోసం ఎన్‌హెచ్ఆర్‌సీకి ఫిర్యాదు

by Ajay Maddhiboyina |

క్రీడాకోట నియామకాలలో డీఎస్సీ స్పోర్ట్స్ రీ-వెరిఫికేషన్ ఫలితాలు ప్రకటించాలని జాతీయ మానవ హక్కుల సంఘంలో సామాజిక కార్యకర్త నీలం రవి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు పరిగణలోకి తీసుకున్న ఎన్‌హెచ్ఆర్‌సీ బుధవారం విచారణ జరిపింది.

క్రీడాకోట నియామకాల కోసం ఎన్‌హెచ్ఆర్‌సీకి ఫిర్యాదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: క్రీడాకోట నియామకాలలో డీఎస్సీ స్పోర్ట్స్ రీ-వెరిఫికేషన్ ఫలితాలు ప్రకటించాలని జాతీయ మానవ హక్కుల సంఘంలో సామాజిక కార్యకర్త నీలం రవి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు పరిగణలోకి తీసుకున్న ఎన్‌హెచ్ఆర్‌సీ బుధవారం విచారణ జరిపింది. గత ఏడాది నుంచి జాతీయ క్రీడాకారులకు అనర్హులు అని ప్రకటించారని అయినా, క్రీడాకోట పాలసీకి వ్యతిరేకంగా అనర్హులను ఉద్యోగాల్లో కొనసాగిస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ అధికారిపై ఫిర్యాదు చేశారు. గతంలో అధికార్లు అధికార దుర్వినియోగం చేస్తూ అన్యాయంగా 33 మందికి ఉద్యోగాలు కల్పించారని పేర్కొన్నారు. హైకోర్టు జోక్యం చేసుకోవడంతో విద్యాశాఖ అధికారులు రీవెరిఫికేషన్ చేశారని అయినా మరోమారు అనర్హులు ఉద్యోగాల్లో కొనసాగుతున్నారని నీలం రవి వెల్లడించారు. 97 మంది జాతీయ క్రీడాకారులకు అన్యాయం జరిగిందని పేర్కొన్నారు.

Next Story