Hyderabad : కాంగ్రెస్ సోషల్ మీడియా సెల్ పై బీఆర్ఎస్ నాయకుల ఫిర్యాదు

by Muthe.Rajitha |

కాంగ్రెస్ సోషల్ మీడియా సెల్ పై బీఆర్ఎస్ నాయకులు సైబరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

Hyderabad : కాంగ్రెస్ సోషల్ మీడియా సెల్ పై బీఆర్ఎస్ నాయకుల ఫిర్యాదు
X

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ సోషల్ మీడియా సెల్ పై బీఆర్ఎస్ నాయకులు సైబరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ అధినాయకత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల ట్విట్టర్ వేదికగా.. కేసీఆర్(KCR), హరీష్ రావు(Harish Rao) మధ్య విభేదాలు వచ్చినట్టుగా, రాజకీయంగా తొక్కేస్తున్నారని ఆగ్రహిస్తున్నట్లుగా పోస్ట్ చేసిన "తెలుగు వైబ్స్"(Telugu Vibes) అనే ట్విట్టర్ హ్యాండిల్ పై మరియు దాని వెనుక ఉన్న కాంగ్రెస్ సోషల్ మీడియా సెల్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) మాట్లాడుతూ.. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఆక్టివిస్టులను రాత్రికి రాత్రే అరెస్ట్ చేసి, శిక్షలు ఖరారు చేస్తూ, బిఆర్ఎస్ వ్యతిరేక సోషల్ మీడియా అకౌంట్లపై మాత్రం కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దాసోజు శ్రవణ్(Dasoju Shravan) మాట్లాడుతూ.. బిఆర్ఎస్ కు రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణ చూసి తట్టుకోలేక, హరీష్ రావు నిరంతరం ప్రజల్లో ఉండడం జీర్ణించుకోలేకనే రేవంత్ రెడ్డి టీం ఇలాంటి చిల్లర పనులకు ఒడిగడుతున్నారని విమర్శించారు. వెంటనే బిఆర్ఎస్ నాయకులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టించే వారిపై తక్షణమే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎస్సీ, ఎస్టీ కమీషన్ చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, అభిలాష్ రావు, విజయ్ పాల్గొన్నారు.

Next Story