తీన్మార్ మల్లన్నపై ఎల్బీ నగర్ పీఎస్‌లో ఫిర్యాదు.. చర్యలు తీసుకోవాలని జాగృతి నేతల డిమాండ్

by Kema Shiva Kumar |

తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)పై చింతపండు నవీన్ (తీన్మార్ మల్లన్న) అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.

తీన్మార్ మల్లన్నపై ఎల్బీ నగర్ పీఎస్‌లో ఫిర్యాదు.. చర్యలు తీసుకోవాలని జాగృతి నేతల డిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)పై చింతపండు నవీన్ (తీన్మార్ మల్లన్న) అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే మల్లన్న వ్యాఖ్యలకు సీరియస్ అయిన జాగృతి కార్యకర్తలు మేడిపల్లిలోని క్యూ న్యూస్ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. అక్కడున్న సిబ్బందిపై చేయిచేసుకుని ఫర్నీచర్, అద్దాలు, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. అదేవిధంగా ఎమ్మెల్యే తీన్మార్ మల్లన్నపై కూడా దాడికి చేయగా.. ఆయన కుడి చేతికి గాయమైంది. దీంతో తమ నాయకురాలు కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna)పై వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఎల్‌బీ నగర్‌ (LB Nagar)‌లోని మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు. వారితో పాటు వివిధ సంఘాల నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వారు నేరుగా ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తీన్మార్ మల్లన్న చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

Next Story