కేటీఆర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయండి.. ఈసీకి ఫిర్యాదు

by Gantepaka Srikanth |

మాజీ మంత్రి కేటీఆర్‌(KTR)పై ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేశారు.

కేటీఆర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయండి.. ఈసీకి ఫిర్యాదు
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి కేటీఆర్‌(KTR)పై ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేశారు. మైనర్లను ఎన్నికల ప్రచారంలో ఉపయోగిస్తున్నారని.. కేటీఆర్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని షఫీవుద్దీన్‌ అనే ఓటరు కోరారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రచారాలు చేస్తున్న కేటీఆర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఇటీవలే ‘ఓటుకు రూ.5 వేలు తీసుకోండి.. భారత రాష్ట్ర సమితికి ఓటేయండి అంటూ కేటీఆర్‌ మాట్లాడిన మాటలు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా ఉన్నాయి.. ఎన్నికల సంఘం(ఈసీ) తక్షణమే స్పందించి ఆయనపై సుమోటోగా కేసు నమోదు చేయాలి’ అని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ కోరారు. మరోవైపు.. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ నేతలు పెద్ద కుట్రకు తెరలేపారని కేటీఆర్ ఆరోపిస్తున్నారు.

Next Story