- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోండి.. స్పీకర్‍కు బీఆర్ఎస్ ఫిర్యాదు
by Prasad Jukanti |
నదీజలాలపై చర్చ విషయంలో ట్విస్ట్ చోటు చేసుకుంది.

X
దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: నదీజలాలపై చర్చ సమయంలో సభను తప్పుదోవ పట్టించారని అందువల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్‍కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సెక్రటరీ తిరుపతికి ఫిర్యాదు కాపీ అందజేశారు. ఇటీవల శాసన సభలో కృష్ణా జలాలపై జరిగిన చర్చ సందర్భంగా తప్పుడు సమాచారం ఇచ్చి సభను తప్పుదోవ పట్టించిన సీఎం రేవంత్ రెడ్డి పై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు చేపట్టాలని కోరారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశ మినిట్స్ పై సీఎం తప్పుదోవ పట్టించారని, రాయలసీమ ఎత్తిపోతల పనుల నిలిపివేత, కృష్ణా జలాల్లో తాత్కాలిక ఒప్పందంపై సీఎం సభను తప్పుదోవ పట్టించారని ఫిర్యాదులో ఆరోపించారు.
Next Story






