- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ.. జనసేన కీలక నిర్ణయం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల పోటీపై రెండు మూడు రోజుల్లో డిసిషన్ తీసుకోనున్నట్లు వెల్లడించింది. హైదరాబాద్ లోని జనసేన పార్టీ ఆఫీస్ లో ముఖ్యనేతలు, కార్యకర్తలతో పవన్ కల్యాణ్ బేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకత్వం పోటీపై నేతల అభిప్రాయాలను జనసేన చీఫ్‌కు తెలిపింది. ఈ ఎన్నికల్లో బరిలోకి దిగకుంటే తెలంగాణలో క్యాడర్ బలహీన పడే ఛాన్స్ ఉందని నేతలు పవన్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన పవన్ కల్యాణ్ తన మీద ఒత్తిడి ఉన్న మట వాస్తవం అని, నాయకులు, జనసేన కార్యకర్తలు అభిప్రాయాలకు కూడా తాను విలువ ఇస్తానన్నారు. సరైన నిర్ణయం తీసుకునేందుకు ఒకటి రెండు రోజుల సమయం అవసరమని పవన్ తెలిపారు. దీంతో త్వరలోనే తెలంగాణలో జనసేన పోటీపై క్లారిటీ రానుంది.
Next Story






