ఫెర్టిలిటీ సెంటర్లపై కమిటీ ఏర్పాటు

by Muthe.Rajitha |

హైదరాబాద్‌(Hyderabad)లోని ఫెర్టిలిటీ సెంటర్ల(Fertility centers)లో లోపాలను గుర్తించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక కమిటీ(Committee)ని ఏర్పాటు చేసింది.

ఫెర్టిలిటీ సెంటర్లపై కమిటీ ఏర్పాటు
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌(Hyderabad)లోని ఫెర్టిలిటీ సెంటర్ల(Fertility centers)లో లోపాలను గుర్తించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక కమిటీ(Committee)ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సభ్యులుగా ఫ్యామిలీ వెల్‌ఫేర్‌ కమిషనర్‌ ఎస్. సంగీత సత్యనారాయణ, ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ సీఈవో పి. ఉదయ్ కుమార్, హైదరాబాద్‌ జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి (DMHO) డా. ఉదయ్ ఉన్నారు. ఈ కమిటీ ఏర్పాటు వెనుక ప్రధాన ఉద్దేశం ఫెర్టిలిటీ సెంటర్లలో నిబంధనల ఉల్లంఘనలు, చట్టవిరుద్ధమైన వాణిజ్య సరోగసీ పద్ధతులను గుర్తించడం.

ఫెర్టిలిటీ సెంటర్ల నిఘాపై ప్రభుత్వానికి సూచనలు ఇవ్వడం. కాగా హైదరాబాద్ లోని సరోగసీ సెంటర్లపై ఇప్పటికే అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన ఫెర్టిలిటీ సెంటర్లపై చర్యలు తీసుకుంటున్నారు.

Next Story