- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth: యాదాద్రి పవర్ ప్లాంట్ యూనిట్-2 ప్రారంభం
యాదాద్రి పవర్ ప్లాంట్(Yadadri Power Plant) యూనిట్-2ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించారు.

దిశ, వెబ్‌డెస్క్: యాదాద్రి పవర్ ప్లాంట్(Yadadri Power Plant) యూనిట్-2ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహాతో కలిసి శనివారం ప్రారంభించారు. అనంతరం ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేశారు. ఈ వైటీపీఎస్ యూనిట్-2లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది. కాగా, దామరచర్ల(Damercherla)లోని యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్‌లో మొత్తంగా ఐదు యూనిట్లు ఉన్నాయి. ఒక్కో యూనిట్ సామర్థ్యం 800 మెగావాట్లు. ఇందులో ఇప్పటికే మొదటి యూనిట్ ప్రారంభం కాగా, ఇవాళ 2వ యూనిట్‌ను ప్రారంభించారు. 72 గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్తు ఉత్పత్తి కొనసాగిన అనంతరం యూనిట్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేస్తారు. త్వరలోనే ఈ ప్లాంట్ నుంచి 1600 మెగావాట్ల విద్యుత్తు గ్రిడ్‌తో అనుసంధానం కానున్నది.






