Sofia Qureshi: కల్నల్‌ సోఫియా ఖురేషీ మతంపై చర్చ.. పాక్ యువతికి భారతీయుల కౌంటర్

by Prasad Jukanti |   (  Updated:2025-05-07 12:46:34  IST  )

కల్నల్ సోఫియా ఖురేషీ మతంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.

Sofia Qureshi: కల్నల్‌ సోఫియా ఖురేషీ మతంపై చర్చ.. పాక్ యువతికి భారతీయుల కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: పహెల్గాం ఉగ్రదాడి విషయంలో భారత్ రివేంజ్ తీర్చుకుంది. పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్ర శిబిరాలపై భారత సైన్యం విరుచుకుపడింది. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పేరుతో మెరుపు దాడులు చేసి దాయాది దేశానికి మన సత్తా ఎంటో మరోసారి నిరూపించింది. అర్థరాత్రి జరిగిన ఈ ఆపరేషన్ కు సంబంధించిన వివరాలను బుధవారం ఉదయం కేంద్ర రక్షణ, విదేశాంగ శాఖ కేంద్ర రక్షణ, విదేశాంగ శాఖ బ్రీఫింగ్ ఇచ్చింది. ఈ సమావేశంలో ఇద్దరు మహిళా అధికారులు ఉండటం అందరి దృష్టిని ఆకర్షించింది. అందులో ఒకరు కల్నల్ సోఫియా ఖురేషీ (ఇండియన్ ఆర్మీ), మరొకరు కమాండర్ వ్యోమికా సింగ్ (ఎయిర్ ఫోర్స్). ఈ సమావేశం అనంతరం ఈ ఇద్దరు మహిళా అధికారు పేర్లు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్ పేరు దెబ్బకు కడుపుమంటతో ఉన్న పాకిస్తాన్ ఈ విషయంలో నక్కజిత్తులు వేస్తోంది. ఈ ఆపరేషన్ లో సోఫియా ఖురేషీ (Colonel Sophia Qureshi) మతాన్ని చర్చకు తెస్తోంది.

భారతీయుల కౌటర్:

జోహా అనే పాకిస్తాని నెటిజన్ల సోఫియా ఖురేషీ వీడియోను షేర్ చేస్తూ భారత్ ఓ ముస్లిం మహిళను ఉపయోగించుకుంటోందని ఎక్స్ వేదికగా పోస్టు చేసింది. ఈ పోస్టుపై ఇండియన్ నెటిజన్లు రకరకాల కౌంటర్లు ఇస్తున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ ఇంత ఉన్న త స్థానాల్లో ఉన్న మహిళను మీరు చూసి ఉండరు. ఆమె ముస్లిం అయితేనేం భారతీయురాలు. ఆమె తన దేశం గర్వపడేలా పని చేస్తున్నారని కామెంట్ చేయగా మరో నెటిజన్ స్పందిస్తూ ఇది ఇండియా. మహిళలను ఇంత గొప్ప స్థానంలో చూడటం మీకు తెలియదని మాకు తెలుసు. వెళ్లి మీ దేశం గురించి శ్రద్ధ వహించండి అంటూ కౌంటర్ ఇచ్చారు. మరికొందరు భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ మంటకు బర్నాల్ రాసుకోవాలంటూ కౌంటర్లు వేస్తున్నారు.

Next Story