- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ వ్యాప్తంగా రేపటినుంచి కాలేజీలు ఓపెన్
తెలంగాణ ప్రభుత్వం(Congress Govt)తో విద్యా సంస్థల యాజమాన్యాలు జరిపిన చర్చలు సఫలం అయ్యాయి.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం(Congress Govt)తో విద్యా సంస్థల యాజమాన్యాలు జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. ఈ వారంలో ఫీజు రీయింబర్స్ మెంట్(Fee Reimbursement) బకాయిలు రూ.600 కోట్లు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. దీంతో బంద్ విరమిస్తున్నట్లు ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు ప్రకటించాయి. మిగిలిన రూ.600 కోట్లు దీపావళికి ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుంచి కాలేజీలు ఓపెన్ కానున్నాయి. కాగా, పెండింగ్ ఉన్న ఫీజు బకాయిలు చెల్లించకపోవడం వల్ల కళాశాలను నిర్వహించే పరిస్థితి లేకుండా పోతోందని గతకొన్ని రోజులుగా యాజమాన్యాలు ఆందోళన చేస్తున్నాయి. ఇటీవల విద్యార్థులు సైతం రోడ్డెక్కి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే బకాయి పడ్డ ఫీజులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఇది తీవ్రరూపం దాల్చి సమ్మెకు దారి తీయడంతో ప్రభుత్వం చర్చలు జరిపింది. చర్చలు సఫలం కావడంతో రేపటి నుంచి కాలేజీలు ఓపెన్ చేస్తున్నట్లు కాలేజీ యాజమాన్యాలు ప్రకటించాయి.






