- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Colleges Closed: రాష్ట్రంలో కాలేజీలు బంద్ వాయిదా.. ప్రభుత్వంతో చర్చలు సఫలం.. ఏమైందంటే?
రాష్ట్రంలో ప్రైవేట్ కళాశాలల బంద్‌ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు ప్రకటించాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ప్రైవేట్ కళాశాలల బంద్‌ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు ప్రకటించాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపుల విషయంలో (government) ప్రభుత్వంతో జరిగిన చర్చలు సఫలమయ్యాయి. ఆదివారం ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు , సీఎస్ రామకృష్ణ రావు, హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్, ఉన్నత విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కార్యదర్శలు, ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ ప్రైవేటు కళాశాలల సమస్యలను ప్రభుత్వం అర్థం చేసుకుందన్నారు. ఈ చర్చలు సానుకూలంగా కొనసాగాయని, ఆదివారం కాబట్టి, సోమవారం ప్రభుత్వపరంగా ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. అప్పటివరకు సమ్మెను విరమించమని యాజమాన్యాలను కోరగా, వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు.
బంద్‌కు పిలుపునిచ్చిన కళాశాలల సమాఖ్య..
(Fee reimbursement) ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలంటూ ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య (ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్‌స్టిట్యూషన్స్- ఫతి) బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం రూ.8 వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని, గత కొన్ని నెలలుగా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఫతి పేర్కొంది. దీనితో ఈనెల 15 నుంచి నిరవధిక బంద్‌కు సిద్ధమని హెచ్చరించింది. ఈ నెల 21 లోపు టోకెన్ జారీ చేసి రూ.1200 కోట్లు చెల్లించాలని, లేకపోతే 23 నుంచి 25 తేదీల్లో విద్యార్థులతో సమావేశాలు నిర్వహిస్తామని తెలిపింది.
చర్చలు - సమస్యలు:
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోసం డిమాండ్ చేస్తున్న ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలతో ప్రభుత్వం శనివారం చర్చలు జరిపింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో ఫతి చైర్మన్ రమేష్ బాబు, సెక్రటరీ జనరల్ రవికుమార్, ట్రెజరర్ కృష్ణారావు తదితరులు చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ లభించకపోవడంతో ఫతి ఆదివారం సర్వసభ్య సమావేశం నిర్వహించి తదుపరి కార్యాచరణ ప్రకటించాలని నిర్ణయించింది.
మూడేళ్ల బకాయిలు:
ఇంజనీరింగ్, ఫార్మా, వంటి వృత్తి విద్యా కళాశాలలు గత మూడేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల కోసం ఎదురు చూస్తున్నాయి. బకాయిల చెల్లింపు విషయంలో విద్యార్థుల సర్టిఫికెట్లు నిలిపివేయడం వంటి సమస్యలు కూడా తలెత్తిన విషయం తెలిసిందే.






