- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
99 డేస్ యాక్షన్ ప్లాన్.. సీఎం రేవంత్ రెడ్డితో కలెక్టర్ల సమావేశం ప్రారంభం
రాష్ట్రవ్యాప్త కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. 99 రోజుల యాక్షన్ ప్లాన్ అమలుపై చర్చిస్తున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: అన్ని జిల్లాల కలెక్టర్లతో (District Collectors Meeting) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) సమావేశం ప్రారంభమైంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో వేగం పెంచే లక్ష్యంతో ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక పేరుతో 99 డేస్ యాక్షన్ ప్లాన్ (99 Days Action Plan) అమలు చేయబోతోంది ఈ నేపథ్యంలో రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న సదస్సులో పరిపాలనలో వేగం, సమన్వయం, లక్ష్య సాధనపై కలెక్టర్లకు సీఎం కీలక దిశానిర్దేశం చేస్తున్నారు. సీఎస్ కె.రామకృష్ణారావు ఇప్పటికే ఇచ్చిన ఆదేశాలతో క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను బేరీజు వేసుకోవడానికి వీలుగా కలెక్టర్లందరూ తమ జిల్లాలకు సంబంధించిన సమగ్ర సమాచారంతోఈ సదస్సుకు హాజరైనట్లు తెలుస్తోంది.
కలెక్టర్లకు గ్రేడింగ్:
జిల్లాల్లో బాగా పని చేసిన కలెక్టర్లకు సీఎం గ్రేడింగ్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. తమ ప్రభుత్వం పనితీరుకే ప్రయార్టీ ఇస్తామని బాగా పని చేసిన కలెక్టర్లకు ప్రమోషన్లు కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలో అనేక సందర్బాల్లో చెబుతూ వచ్చారు. ఈ మేరకు ఏసీ రూములు వదిలి క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా మీటింగ్‍లో పనితీరు ఆధారంగా కలెక్టర్లకు సీఎం గ్రేడింగ్ ఇవ్వనున్నారని ఆశించిన మేరకు పని తీరు చూపని కలెక్టర్లకు దిశానిర్దేశం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, చిన్నా రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు, వివిధ జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు.






