సీఎం ఆదేశాలు.. క్షేత్రస్థాయి పర్యటనలకు దిగిన కలెక్టర్లు

by Muthe.Rajitha |

జిల్లాల కలెక్టర్లు నిత్యం క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టాలని ఇటీవల జరిపిన కలెక్టర్ల సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

సీఎం ఆదేశాలు.. క్షేత్రస్థాయి పర్యటనలకు దిగిన కలెక్టర్లు
X

దిశ, వెబ్ డెస్క్ : జిల్లాల కలెక్టర్లు నిత్యం క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టాలని ఇటీవల జరిపిన కలెక్టర్ల సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్లు గ్రామాలబాట పట్టారు. క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ.. గ్రామాల్లో సంక్షేమ‌, అభివృద్ధి ప‌థ‌కాల అమలు తీరును ఎప్పటికప్పుడు ప‌రిశీలిస్తూ, అధికారులకు పలు సలహాలు, సూచనలు చేస్తున్నారు. అయితే కలెక్టర్ల క్షేత్రస్థాయి పర్యటనలపై రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామకృష్ణారావు నిరంత‌రం ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లిన కలెక్టర్లు వీరే

*మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ క‌లెక్ట‌ర్ విజ‌యేందిర బోయి జిల్లాలోని కౌకుంట్ల మండ‌లం తిరుమ‌లాపూర్‌లో ఇందిర‌మ్మ ఇంటి నిర్మాణాన్ని ప‌రిశీలించి.. ల‌బ్ధిదారుతో స్వయంగా మాట్లాడారు.

*హైదరాబాద్ కలెక్టర్ దాస‌రి హ‌రిచంద‌న‌ సికింద్రాబాద్ మారేడ్‌ప‌ల్లిలోని ప్ర‌భుత్వ బాలిక‌ల ఉన్న‌త పాఠ‌శాల‌లో విద్యార్థినుల‌తో మాట్లాడారు. విద్యా బోధన, మధ్యాహ్న భోజన పథకం వివరాలు అడిగి తెలుసుకున్నారు.

*మ‌హ‌బూబాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ అద్వైత్ కుమార్ సింగ్ మ‌రిపెడ ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రం సందర్శించి, ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, మందులపై రోగులతో మాట్లాడారు. వైద్యులు, సిబ్బంది సమయపాలానపై ఆరా తీశారు.

*మంచిర్యాల జిల్లా క‌లెక్ట‌ర్ కుమార్ దీప‌క్‌ భీమారం ప్ర‌భుత్వ ఉన్న‌త పాఠ‌శాల‌లో మ‌ధ్యాహ్న భోజ‌న త‌యారీని ప‌రిశీలించి, భోజన మెనూ వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

Next Story