- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Flash.. Flash.. మునగాల MRO ఆఫీసులో సగం మంది అధికారులను సస్పెండ్ చేసిన కలెక్టర్
సూర్యాపేట జిల్లా అధికారులకు కలెక్టర్ బిగ్ షాక్ ఇచ్చారు. అధికారుల పనితీరును తెలుసుకునేందుకు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మునగాల తహసీల్దార్ కార్యాలయానికి ఆకస్మిక తనిఖీకి వెళ్లారు.

దిశ, నల్లగొండ బ్యూరో : సూర్యాపేట జిల్లా అధికారులకు కలెక్టర్ బిగ్ షాక్ ఇచ్చారు. అధికారుల పనితీరును తెలుసుకునేందుకు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ (Collector Tejas Nand Lal Pawar) గురువారం మునగాల తహసీల్దార్ కార్యాలయాని(Munagala Tehsildar's office)కి ఆకస్మిక తనిఖీకి వెళ్లారు. కానీ ఉదయం 11 గంటలు దాటినా సగానికి పైగా రెవెన్యూ అధికారులు ఆఫీసుకు రాకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఆఫీసులో సిబ్బంది సమయపాలన పాటించరా అని తహసీల్దార్‌ను ప్రశ్నించారు. వెంటనే విధులకు గైర్హాజరు అయిన డిప్యూటీ తహసీల్దార్, ఎంపీఎస్ఓ, జూనియర్ అసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్లతో సహా మరికొంతమంది సిబ్బందిని సస్పెండ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే కార్యాలయ సిబ్బంది గైర్హాజరుపై వివరణ ఇవ్వాలని తహసీల్దార్‌ను కోరారు. కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్.. సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ సంఘటన జిల్లా అధికారుల్లో గుబులు పుట్టిస్తోంది. ముఖ్యంగా ఇస్టానూసారంగా విధులకు హాజరవుతున్న అధికారుల వెన్నుల్లో వణుకు తెప్పిస్తోంది. ప్రస్తుతం మునగాల తహసీల్దార్ ఆఫీసులో సగానికి పైగా సిబ్బంది సస్పెండ్ కావడం సూర్యాపేట జిల్లాలో సంచలనంగా మారింది. మరోవైపు కలెక్టర్ చర్యలపై జిల్లా ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.






