10వ తరగతిలో మంచి మార్కులు..ఇంటికి వెళ్లి సన్మానించిన కలెక్టర్

by Ajay Maddhiboyina |   (  Updated:2025-05-03 11:04:27  IST  )

ఇటీవల పదవ తరగతి ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో భువనగిరి జిల్లా

10వ తరగతిలో మంచి మార్కులు..ఇంటికి వెళ్లి సన్మానించిన కలెక్టర్
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల పదవ తరగతి ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో భువనగిరి జిల్లా నారాయణపూర్ మండలంలోని కంకణాల గూడెం గ్రామానికి చెందిన భరత్ చంద్ర అనే విద్యార్థికి 73శాతం మార్కులు వచ్చాయి. భరత్ చంద్రది నిరుపేద కుంటుంబం కావడంతో గతంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు వారి కుటుంబానికి ఆర్థికసాయం అందజేశాడు. ఆ సమయంలో కష్టపడిచదవాలని భరత్ చంద్రకు సూచించాడు. భరత్ స్థిరపడే వరకు అన్ని రకాలుగా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చాడు.

కలెక్టర్ ప్రోత్సాహంతో చదివిన భరత్ 73శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. విషయం తెలుసుకున్న కలెక్టర్ హనుమంతరావు ఇప్పటికే ఫోన్ లో అభినందించగా, తాజాగా భరత్ నివాసానికి వెళ్లి సన్మానించారు. వారి కుటుంబానికి నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..అత్యంత నిరుపేద కుటుంబానికి చెందిన భరత్ చంద్ర ఓ దశలో చదువు మానేయాలని అనుకున్నాడని చెప్పారు. చదువుకునే వ్యక్తులకు పేదరికం అడ్డుకాదని అన్నారు. ఇలాంటి మట్టిలో మానిక్యాలను ప్రోత్సహిస్తే జీవితంలో ఉన్నతంగా ఎదుగుతారని చెప్పారు.

Next Story