T Congress: కాంగ్రెస్ నాయకులకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ టాస్క్

by Prasad Jukanti |

ప్రతి గ్రామంలో సంతకాల సేకరణ చేపట్టాలని మహేశ్ కుమార్ గౌడ్ ఆదేశించారు.

T Congress: కాంగ్రెస్ నాయకులకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ టాస్క్
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో ఓటు చోరీ పెద్ద ఎత్తున జరిగిందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఆరోపించారు. ఎన్నికల కమిషన్ బీజేపీకి అనుబంధ సంఘంగా పని చేస్తోందని ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ అన్ని ఆధారాలతో ఓటు చోరీలను (Vote Chori) బయటపెట్టారని అయినా ఈసీ నుంచి ఎలాంటి స్పందన లేదని విమర్శించారు. ఇవాళ రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో జూమ్ మీటింగ్ నిర్వహించిన మహేశ్ కుమార్ గౌడ్.. టీపీసీసీలోని ప్రతినిధులతో మాట్లాడారు. భారీ వర్షాల దృష్ట్యా ఓటు చోరీకి వ్యతిరేకంగా రాష్ట్రంలో సంతకాల సేకరణ కార్యక్రమం ఆలస్యం అయిందన్నారు. ఇప్పటి నుంచి ప్రతి గ్రామంలో సంతకాల సేకరణ చేపట్టాలని, ప్రతి గ్రామంలో కనీసం వంద మందితో సంతకాలు చేయించి బీజేపీ ఓటు చోరీ ఎలా చేసిందో ప్రజలకు వివరించాలన్నారు. ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు ప్రతి గ్రామంలో సంతకాల సేకరణ చేపట్టాలని ఆదేశించారు.

Next Story