- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలుగు రాష్ట్రాల్లో దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు
తెలుగు రాష్ట్రాలలో చలితీవ్రత రోజు రోజుకు పెరిగిపోతుంది. ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోతున్నాయి. శనివారం తెలంగాణ వ్యాప్తంగా 4.5 నుండి 11.2 డిగ్రీల సెల్సియల్ మధ్య అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాలలో చలితీవ్రత రోజు రోజుకు పెరిగిపోతుంది. ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోతున్నాయి. శనివారం తెలంగాణ వ్యాప్తంగా 4.5 నుండి 11.2 డిగ్రీల సెల్సియల్ మధ్య అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మం, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట మినహా మిగితా జిల్లాల్లో 10 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్ లోనూ గతేడాదితో పోలిస్తే చలి తీవ్రత చాలా పెరిగింది. నగరంలో 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మెదక్ లో 5.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
ఏపీలోనూ పరిస్థితి ఇలానే కనిపిస్తుంది. అల్లూరి జిల్లా అరకులో అయితే మంచు కురుస్తోంది. ఇక్కడ 3.5 డిగ్రీల ఉష్ణోగత్ర నమోదైంది. అరకులో సాయంత్రం 5గంటలు అవ్వకముందే వాతావరణం మారిపోతోంది. చలికి బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడిపోతున్నారు. అదే విధంగా మన్యం, చిత్తూరు, కాకినాడ, ఎన్టీఆర్, నంద్యాల, ఏలూరు, అనకాపల్లి, విజయనగరం, శ్రీ సత్యసాయి, శ్రీకాకుళం, కర్నూలు, అన్నమయ్య, అనంతపురం జిల్లాల్లో కూడా 10డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.






