- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో చలి తీవ్రత పెరుగుదల
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన నాలుగు రోజుల్లో మరోసారి చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. వాతావరణ శాఖ ప్రకారం ఈ రోజు ఉదయం.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో గడిచిన నాలుగు రోజుల్లో మరోసారి చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. వాతావరణ శాఖ ప్రకారం ఈ రోజు ఉదయం.. మెదక్ నగరంలో అత్యల్పంగా 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా, పటాన్‌చెరు (11°C), హనుమకొండ (12.5°C), రామగుండం (13.8°C), నిజామాబాద్ (13.9°C), హైదరాబాద్ (14.2°C)లలో కూడా సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత వారం రోజులుగా నమోదైన ఉష్ణోగ్రతలతో పోలిస్తే, రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సగటున 2 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గినట్టు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు కూడా స్వల్పంగా తగ్గడంతో, ఉదయం,సాయంత్రం వేళల్లో చలిగాలుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
దిత్వా తుఫాను ప్రభావం
బంగాళఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను కారణంగా ఏపీ మీదుగా తెలంగాణ రాష్ట్రంలో చల్లని గాలులు వీస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారి, చలి తీవ్రత పెరిగింది. సాధారణంగా, తూర్పు లేదా ఆగ్నేయ దిశల నుంచి వచ్చే గాలులు తీర ప్రాంత తుఫానుల తర్వాత చల్లబడతాయి. తుఫాను తీరం దాటిన తర్వాత, ఆ తుఫాను వ్యవస్థ యొక్క అవశేషాలు చుట్టుపక్కల ప్రాంతాల వైపు కదలి, రాష్ట్రంపై శీతల, పొడి గాలుల ప్రవాహానికి దారితీస్తాయి. ఈ ప్రభావం వల్ల తెలంగాణలో ముఖ్యంగా నైరుతి, ఉత్తర జిల్లాలో ఒక్కసారిగా చలి తీవ్రత పెరిగింది. ఈ శీతల గాలుల కారణంగానే ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోయాయినట్లు అధికారులు తెలుపుతున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు దిత్వా తుఫాన్ తీరం దాటే అవకాశం ఉండగా.. మరో నాలుగు రోజుల పాటు చలి తీవ్రత ఇలానే కొనసాగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.






