- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీశైలం లడ్డు ప్రసాదంలో బొద్దింక.. ప్రసాదాల కౌంటర్ వద్ద భక్తుల ఆందోళన
శ్రీశైలం లడ్డూ ప్రసాదంలో బొద్దింక ప్రత్యక్షం అయ్యింది. ఆలయానికి వచ్చిన ఓ భక్తుడు లడ్డు కొనుగోలు చేసి దానిని తినడానికి ప్రయత్నించగా అందులో బొద్దింక కనిపించింది.

దిశ, వెబ్ డెస్క్: శ్రీశైలం లడ్డూ ప్రసాదంలో బొద్దింక ప్రత్యక్షం అయ్యింది. ఆలయానికి వచ్చిన ఓ భక్తుడు లడ్డు కొనుగోలు చేసి దానిని తినడానికి ప్రయత్నించగా అందులో బొద్దింక కనిపించింది. దీంతో భక్తుడు ఇదేంటని అక్కడనే ఉన్న అధికారులను నిలదీయడంతో సమాధానం చెప్పకుండా లడ్డూను అతడి చేతిలో నుండి లాక్కునే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్న భక్తులు అంతా లడ్డూలో బొద్దింక రావడం ఏంటి అని కౌంటర్ వద్ద ఆందోళన చేవారు. పక్కన ఉన్న కొంతమంది వీడియో తీయగా వెంటనే దానిని డిలీట్ చేయాలని ఒత్తిడి చేశారు, సామరస్యంగా మాట్లాడుకుందామని విషయం బయటకు రాకుండా ఉండేలా ప్రయత్నం చేశారు. కానీ భక్తులు వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై ఆలయ అధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇదిలా ఉంటే ప్రసాదాన్ని భక్తులు ఎంతో భక్తితో తీసుకుంటారు. అలాంటి ప్రసాదాన్ని నాణ్యత లేకుండా తయారు చేయడం, బొద్దింకలు వస్తున్నా పట్టించుకోకుండా ఉండటం లాంటివి వివాదాలకు దారి తీస్తున్నాయి.






