వర్షాలతో బొగ్గు ఉత్పత్తి కుంటుపడకుండా చూడాలి.. సింగరేణి సీఎండీ బలరామ్

by Kema Shiva Kumar |

వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో సింగరేణి సంస్థలో బొగ్గు ఉత్పత్తి, బొగ్గు రవాణా కుంటుపడకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సింగరేణి సంస్థ ఛైర్మన్ మేనేజింగ్​డైరెక్టర్ ఎన్.బలరామ్ అన్ని ఏరియాలోని జనరల్ మేనేజర్లకు సూచించారు.

వర్షాలతో బొగ్గు ఉత్పత్తి కుంటుపడకుండా చూడాలి.. సింగరేణి సీఎండీ బలరామ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో సింగరేణి సంస్థలో బొగ్గు ఉత్పత్తి, బొగ్గు రవాణా కుంటుపడకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సింగరేణి సంస్థ ఛైర్మన్ మేనేజింగ్​డైరెక్టర్ ఎన్.బలరామ్ అన్ని ఏరియాలోని జనరల్ మేనేజర్లకు సూచించారు. శనివారం ఆయన కొత్తగూడెం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లు, డైరెక్టర్లతో ఉత్పత్తి‌పై ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ బలరామ్ మాట్లాడుతూ.. భారీ వర్షాల వల్ల ఓపెన్ కాస్ట్ క్వారీలలో నీరు నిలిచి బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడే అవకాశం ఉండటంతో ముందస్తుగా సంపులలోని నీటిని తొలగించడం కోసం తగినన్ని మోటారు పంపులను సమకూర్చుకుని సంసిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.

సింగరేణి గనులవారీగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకోవాలని తెలిపారు. రోజుకు కనీసం 2.2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 2.4 లక్షల టన్నుల బొగ్గు రవాణా సాధించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సంస్థ డైరెక్టర్ ఈఅండ్ఎం డి.సత్యనారాయణ రావు, డైరెక్టర్ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ కె.వెంకటేశ్వర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ ఎస్‌‌డీ.ఎం సుభాని, డైరెక్టర్ సీపీపీ మనోహర్, జీఎం మార్కెటింగ్, ఎన్.వి రాజశేఖర్ రావు‌లతో పాటు అన్ని ఏరియాల్లోని జనరల్ మేనేజర్లు, కార్పొరేట్‌లోని వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story