రెయిన్ బో చిల్డ్రన్స్ ఆసుపత్రితో కోల్ ఇండియా ఒప్పందం

by Prasad Jukanti |   (  Updated:2025-11-22 12:24:41  IST  )

తలసేమియా, అప్లాస్టిక్ అనీమియాతో బాధపడుతున్న చిన్నారులకు వైద్యసాయం కోసం ఒప్పందం జరిగింది.

రెయిన్ బో  చిల్డ్రన్స్ ఆసుపత్రితో కోల్ ఇండియా ఒప్పందం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తలసేమియా, అప్లాస్టిక్ అనీమియా (Thalassemia, Aplastic Anemia) బాధిత చిన్నారులకు అండగా ప్రభుత్వ రంగ సంస్ధ కోల్ ఇండియా (Coal India) ముందడుగు వేసింది. బాధిత చిన్నారులకు అవసరమైన వైద్య సహాయం అందించేందుకు కోల్ ఇండియా లిమిటెడ్ ఇవాళ హైదరాబాద్ లోని రెయిన్‍బో చిల్డ్రన్స్ ఆసుపత్రితో (Rainbow Childrens Hospital) ఎంవోయూ కుదుర్చుకుంది. బంజారాహిల్స్ లోని రెయిన్‍బో చిల్డ్రన్స్ ఆసుపత్రిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో ఈ ఎంవోయూ కార్యక్రమం జరిగింది. తలసేమియా బాల సేవా యోజన (TBSY)- కోల్‌ ఇండియా లిమిటెడ్ CSR (కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బులిటీ) కార్యక్రమం ద్వారా తలసేమియా, అప్లాస్టిక్ అనీమియాతో బాధపడే చిన్నారులకు వైద్యసాయంతో పాటు ఉచితంగా బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ సౌకర్యం అందించనున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy).. ఈ కార్యక్రమం, దేశవ్యాప్తంగా తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులను కలిగిన కుటుంబాలకు చేయూతనివ్వడంతో పాటు వేలాది మంది పిల్లల ప్రాణాలను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కోల్ ఇండియా దేశవ్యాప్తంగా బొగ్గు ప్రభావిత ప్రాంతాల్లో సీఎస్ఆర్ కింద వివిధ కార్యక్రమాలు చేపడుతోందని ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, విద్య వంటి అనేక రంగాల్లో పని చేస్తున్నామని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాలతో హృదయ వ్యాధులతో బాధపడుతున్న పిల్లలకు ఉచిత చికిత్స అందిస్తున్నామని చెప్పారు.

Next Story