- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు కొడంగల్‌కు సీఎం దంపతులు!
by Ramesh Naini |
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీసమేతంగా నేడు( ఆదివారం) కొడంగల్‌కు వెళ్లనున్నట్లు సమాచారం. ఇవాళ, రేపు రెండు రోజుల పాటు ఆయన కొడంగల్‌లోనే ఉంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీసమేతంగా నేడు( ఆదివారం) కొడంగల్‌కు వెళ్లనున్నట్లు సమాచారం. ఇవాళ, రేపు రెండు రోజుల పాటు ఆయన కొడంగల్‌లోనే ఉంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు కొడంగల్‌కు వెళ్లనున్నారు. ఈ క్రమంలోనే సతీసమేతంగా సీఎం దంపతులు కొడంగల్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
కాగా, తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ముగిసిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఎన్నికల ప్రచారంలో ఉన్న నేతలకు రెస్ట్ దొరికినట్లయింది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ఉదయం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో విద్యార్థులతో కలిసి ఫుట్ బాల్ ఆడి.. అందరి దృష్టిని ఆకర్షించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Next Story






