- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CMRF: రేవంత్ సర్కార్ సరికొత్త రికార్డు.. పేదలకు వైద్య సాయం రూ.1,685 కోట్లు
సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) విషయంలో రేవంత్ రెడ్డి (Revanth Reddy) సారథ్యంలోని తెలంగాణ సర్కార్ (Telangana Government) సరికొత్త రికార్డును సృష్టించింది.

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) విషయంలో రేవంత్ రెడ్డి (Revanth Reddy) సారథ్యంలోని తెలంగాణ సర్కార్ (Telangana Government) సరికొత్త రికార్డును సృష్టించింది. గత రెండేళ్లలో పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్య సాయాన్ని మరింత విస్తృతం చేసింది. 2014-2024 మధ్య కాలంలో సంవత్సరానికి సగటున రూ.450 కోట్లు సాయం అందించగా, గత రెండేళ్లలో సంవత్సరానికి సగటున రూ.850 కోట్లు సహాయం పంపిణీ చేయడం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా 3,76,373 మంది లబ్ధిదారులకు రూ.1,685.79 కోట్ల ఆర్థిక సాయం అందజేశారు. అందులో లెటర్ ఆఫ్ క్రెడిట్ (LOC) ద్వారా 27,421 కేసులకు గాను రూ.533.69 కోట్లు, రీయింబర్స్‌మెంట్ 3,82,952 కేసులకు గాను రూ.1,152.10 కోట్లను పంపిణీ చేసి సరికొత్త చరిత్ర సృష్టించారు.
రెండు పద్ధతుల్లో సీఎంఆర్ఎఫ్..
సీఎంఆర్ఎఫ్ రెండు ప్రధాన పద్ధతుల్లో పని చేస్తోంది. అందులో మొదటిది నిర్దిష్ట ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిమ్స్, MNJ క్యాన్సర్ హాస్పిటల్, ప్రభుత్వ ENT హాస్పిటల్ వంటి ఆసుపత్రులలో చికిత్స పొందేందుకు ఇచ్చే LOC. ఇందులో చూపిన మొత్తం మేరకు రోగి ఎటువంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేకుండా చికిత్స పొందవచ్చు. రెండోది రీయింబర్స్‌మెంట్ పాలసీ, ఇందులో ఏదైనా ఆసుపత్రిలో (ప్రభుత్వ, ప్రైవేట్) చికిత్స పొంది, బిల్లులు చెల్లించిన తర్వాత, ఖర్చు చేసిన మొత్తంలో కొంత భాగాన్ని తిరిగి చెల్లించవలసిందిగా CMRFకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వం దరఖాస్తును పరిశీలించి, ఆమోదించిన మొత్తానికి చెక్ జారీ చేస్తారు.
దళారుల మోసాలకు చెక్..
ఇటీవల సీఎం రిలీఫ్ ఫండ్‌లో దళారుల మోసాలకు చెక్ పెట్టేందుకు పూర్తిగా ఆన్‌లైన్ విధానాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. నిజమైన లబ్ధిదారుల ఆధార్ వెరిఫికేషన్ జరిపి, చెక్‌లపై లబ్ధిదారుని పేరు, బ్యాంక్ అకౌంట్ నంబర్‌ను ప్రింట్ చేస్తున్నారు. దరఖాస్తుదారుడు తప్పనిసరిగా తెలంగాణకు చెందిన వారై ఉండాలని నిబంధన పెట్టారు. లబ్ధిదారుల వార్షిక కుటుంబ ఆదాయం రూ.1.60 లక్షలు మించకుండా తెల్ల రేషన్ కార్డు కలిగిన వారై ఉండాలి.






