- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రాన్స్‌జెండర్ మహిళకు సీఎంఆర్ఎఫ్ నుంచి ఆర్థిక సాయం
తెలంగాణలో తొలిసారిగా ఒక ట్రాన్స్‌జెండర్ మహిళకు బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ శస్త్రచికిత్స కోసం సీఎంఆర్ఎఫ్ (CMRF) నుండి ఆర్థిక సాయం అందించిన ప్రభుత్వం.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో ట్రాన్స్‌జెండర్ల పట్ల ప్రభుత్వం మానవీయ దృక్పథం తో వ్యవహరిస్తోంది. తొలిసారిగా ఒక ట్రాన్స్‌జెండర్ మహిళకు బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ శస్త్రచికిత్స కోసం 'ముఖ్యమంత్రి సహాయ నిధి' (సీఎంఆర్ఎఫ్) నుంచి ఆర్థిక సహాయాన్ని అందజేసింది. తెలంగాణలో ట్రాన్స్‌జెండర్లకు సమాన అవకాశాలు కల్పించడమే కాకుండా, ఆరోగ్య సేవలలోనూ వారికి అండగా నిలవాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల క్వీర్ సమాజం హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ నిర్ణయం ట్రాన్స్‌జెండర్ల గౌరవప్రదమైన జీవన హక్కులను మరింత బలోపేతం చేస్తుందని 'క్వీర్ బంధు పేరెంట్స్ అసోసియేషన్' అభిప్రాయపడింది. శస్త్రచికిత్స విజయవంతమైన నేపథ్యంలో, క్వీర్ బంధు పేరెంట్స్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ ఎం.ముకంద మాల నేతృత్వంలో ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రి ఓఎస్‌డీ వేముల శ్రీనివాసులును కలిసి ధన్యవాదాలు తెలిపారు.






