కార్మిక సంక్షేమం సంస్థకు అత్యంత ముఖ్యం : సీఎండీ బుద్ధ ప్రకాష్ జ్యోతి

by Bhoopathi Nagaiah |

కార్మిక సంక్షేమం సంస్థకు అత్యంత ముఖ్యమని, కార్మికుల ఆరోగ్యం, విద్య, నివాస సదుపాయాల మెరుగుదలకు సింగరేణి యాజమాన్యం కట్టుబడి ఉందని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి అన్నారు.

కార్మిక సంక్షేమం సంస్థకు అత్యంత ముఖ్యం : సీఎండీ బుద్ధ ప్రకాష్ జ్యోతి
X

దిశ, కొత్తగూడెం: కార్మిక సంక్షేమం సంస్థకు అత్యంత ముఖ్యమని, కార్మికుల ఆరోగ్యం, విద్య, నివాస సదుపాయాల మెరుగుదలకు సింగరేణి యాజమాన్యం కట్టుబడి ఉందని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి అన్నారు. శనివారం కొత్తగూడెం ఏరియాలోని ఉపరితల, భూగర్భ గనులలో పర్యటించారు. ముందుగా నూతనంగా అనుమతులు వచ్చిన వీకే కోల్ మైన్స్ కు వచ్చారు. ఈ సందర్భంగా కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం. షాలేం రాజు వారిని పుష్పగుచ్ఛంతో ఘనంగా స్వాగతం పలికారు. అలాగే సింగరేణి అధికారులు, కార్మిక సంఘాల నాయకులు స్వాగతం పలికారు. వీకే కోల్ మైన్స్లో మొదటిసారిగా ఉత్పత్తి అయిన బొగ్గు రవాణా చేయు లారీకి పచ్చ జెండా ఊపి చైర్మన్ గారు బొగ్గు రవాణాలను ప్రారంభించారు.

అనంతరం వారు వికే సిఎం వ్యూ పాయింట్ నుండి వీకే కోల్ మైన్స్ యొక్క భౌగోళిక స్థితి, ఉత్పత్తి ఉత్పాదకత పనితీరు, భద్రతా చర్యలు, ఉత్పత్తి పరిస్థితులను పరిశీలించారు. అనంతరం గనుల ప్రాంతాలను పరిశీలిస్తూ కార్మికుల పనితీరును, భద్రతా ప్రమాణాలను తెలుసుకున్నారు. గనులలో భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన అధికారులకు సూచించారు. కార్మికులు సురక్షితంగా పని చేయడానికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన గనుల ఉత్పత్తి లక్ష్యాలు, భవిష్యత్ ప్రణాళికలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై చర్చించారు. సింగరేణి సంస్థ అభివృద్ధికి అధికారులు, కార్మికులు సమన్వయంతో పని చేయాలని కార్మిక సంఘ నాయకులు కూడా సహకరించాలని పేర్కొన్నారు. ఉత్పత్తి పెంపు, ఖర్చుల తగ్గింపు, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సింగరేణి ప్రాంత అభివృద్ధికి సంస్థ పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని వెల్లడించారు. అనంతరం వారు పద్మావతి భూగర్భ గనిని సందర్శించి గని యందు బొగ్గు ఉత్పత్తికి వినియోగించే కంటిన్యూస్ మైనర్ ఎల్.హెచ్.డి యంత్రాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. అండర్ గ్రౌండ్ మైన్ లోనికి దిగి మ్యాన్ రైడింగ్ సిస్టం, అండర్ గ్రౌండ్ లోని పంపింగ్ స్టేషన్, సబ్ స్టేషన్ కంటిన్యూస్ మైనర్ పని స్థలాలలో సంబంధిత అధికారులతో వీక్షించారు.

ఈ కార్యక్రమంలో సింగరేణి సంస్థ డైరెక్టర్లు ఎల్.వి. సూర్య నారాయణ, కొప్పుల వెంకటేశ్వర్లు, ఎం. తిరుమలరావు రావు, కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం. షాలేం రాజు, జిఎం ఎన్విరాన్మెంట్ బి సైదులు, ఏఐటియూసి సెంట్రల్ సెక్రెటరీ వి.వెంకట్, కొత్తగూడెం ఏరియా ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎండి. రజాక్, అలాగే కొత్తగూడెం ఏరియా ఎస్ ఓ టు జిఎం జీవి కోటిరెడ్డి, ఏరియా ఇంజనీర్ కే సూర్యనారాయణరాజు, వికే సిఎం ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎం.వి. నరసింహారావు, ఏజెంట్ పద్మావతి గని రామ్ భరోస్ మహతో, వికేసిఎం మేనేజర్ రామచంద్ర మురళి, పద్మావతి ఖని మేనేజర్ ఎం.వి.ఎన్ శ్యాం ప్రసాద్ అలాగే కొత్తగూడెం ఏరియాలోని వివిధ విభాగాల అధిపతులు, అధికారులు, ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Next Story