- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సురక్షిత వీధులు - అందరి హక్కు: సీఎంసీ కమిషనర్ సృజన
కొత్తగా ఏర్పాటు చేసిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ) పరిధిలో సురరక్షితమైన, అందరికీ అందుబాటులో ఉండే వీధుల నిర్మాణమే లక్ష్యంగా ముందుకెళ్లాలని కమిషనర్ సృజన చర్యలు ప్రారంభించారు. ..

దిశ, తెలంగాణ బ్యూరో: కొత్తగా ఏర్పాటు చేసిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ) పరిధిలో సురరక్షితమైన, అందరికీ అందుబాటులో ఉండే వీధుల నిర్మాణమే లక్ష్యంగా ముందుకెళ్లాలని కమిషనర్ సృజన చర్యలు ప్రారంభించారు. అందులో భాగంగానే సైబరాబాద్ పోలీస్ ఆధ్వర్యంలో నోవోటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్ లో గురువారం ‘క్రియేటింగ్ సేఫర్ స్ట్రీట్స్ ఫర్ ఆల్ ఇన్ సైబరాబాద్’ పేరుతో అధికారులు అవగాహన సదస్సు, శిక్షణ సదస్సు నిర్వహించారు. పాల్గొన్నారు.
సురక్షిత వీధులు..మౌలిక వసతులు
సురక్షితమైన, అందరికీ అందుబాటులో ఉండే మరియు ప్రజా కేంద్రిత వీధుల అభివృద్ధిపై చర్చించేందుకు ఈ శిక్షణా సదస్సు ఒక వేదికగా నిలిచింది. పట్టణ ప్రణాళిక నిపుణులు, ఇంజినీర్లు, పౌర పరిపాలన అధికారులు మరియు ట్రాఫిక్ నిర్వహణ సంస్థల ప్రతినిధులు పాల్గొని వివిధ అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. సదస్సులో ‘సురక్షిత వీధుల రూపకల్పన, పాదచారుల మౌలిక సదుపాయాలు, జంక్షన్‌ల అభివృద్ధి, వేగ నియంత్రణ చర్యలు, అందరికీ అనుకూలమైన రవాణా సౌకర్యాల కల్పన’ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. పాదచారులు, సైకిల్ వినియోగదారులు, ప్రయాణికులు, ఇతర రహదారి వినియోగదారుల భద్రతను మెరుగుపరచేందుకు అనుసరించాల్సిన ఉత్తమ విధానాలు, ఆచరణాత్మక పరిష్కారాలను నిపుణులు వివరించారు. పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ పరిష్కారాలు, ట్రాఫిక్ నిర్వహణతోపాటు అమలు చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సమన్వయంతో సురక్షితమైన, సమర్థవంతమైన రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని ఈ సదస్సు నొక్కిచెప్పింది.
నిపుణులతో చర్చలు
సురక్షితమైన వీధుల నిర్మాణం కోసం నిర్వహించిన సదస్సులో పౌర సంస్థలు, ప్రణాళిక నిపుణులు, ఇంజినీర్లు, ప్రణాళిక చట్టాల అమలు చేసే సంస్థలకు చెందిన నిపుణుల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. సాంకేతిక పరిజ్ఞానం మార్పిడి, కెపాసిటీ బిల్డింగ్, పరస్పర సహకారం వంటి అంశాలపై చర్చించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణ ప్రాంతాల్లో ఉద్భవిస్తున్న రవాణా సవాళ్లను ఎదుర్కొనేందుకు సుస్థిరమైన, సమ్మిళిత పట్టణ రూపకల్పన సూత్రాలపై చర్చలు జరిగాయి.
పట్టణాభివృద్దిపై ఫోకస్ : సీఎంసీ కమిషనర్ సృజన..
‘ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు, సదస్సులు సంస్థాగత సామర్థ్యాన్ని పెంపొందించడంతోపాటు వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేస్తాయి. ప్రజా భద్రతకు సంబంధించిన అంశాలపై అవగాహన పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. రహదారి భద్రత, సమ్మిళిత రవాణా, మెరుగైన ప్రజా మౌలిక సదుపాయాలు, సుస్థిర పట్టణాభివృద్ధిని ప్రోత్సహించే కార్యక్రమాలకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుంది. సైబరాబాద్‌లో మరింత సురక్షితమైన, సులభతరమైన, ప్రజా కేంద్రిత వీధుల అభివృద్ధి కోసం అన్ని భాగస్వామ్య సంస్థలు సమన్వయంతో పనిచేయాలనే సంకల్పంతో శిక్షణా సదస్సు ముగిసింది.’ అని వివరించారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్, సైబరాబాద్ పోలీస్, ట్రాఫిక్ పోలీస్ విభాగాల సీనియర్ అధికారులు, సీఎంసీ జోనల్ కమిషనర్లు, శాఖాధిపతులు, డిప్యూటీ కమిషనర్లు, ఇంజినీరింగ్ అధికారులు మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






