ఎల్లుండి గోల్కొండ కోటలో జాతీయ జెండా ఎగురవేయనున్న సీఎం రేవంత్​ రెడ్డి

by Ajay Maddhiboyina |   (  Updated:2025-08-13 17:13:50  IST  )

ఎల్లుండి గోల్కొండ కోటలో జాతీయ జెండా ఎగురవేయనున్న సీఎం రేవంత్​ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆగష్టు 15వ తేదీన జరిగే స్వాతంత్య దినోత్సవ వేడుకల్లో రాష్ట్రానికి చెందిన ప్రముఖలు ఆయా జిల్లాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు సీఎస్​రామకృష్ణారావు జిల్లాల్లో ఆవిష్కరించే ప్రముఖుల పేర్లను పేర్కొంటూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం రేవంత్​ రెడ్డి హైదరాబాద్​లోని గోల్కొండ కోటలోని రాణి మహాల్​ దగ్గర ఉదయం 10 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రముఖులు జిల్లాల్లో ఉదయం 9.30 గంటలకు ఆయా జిల్లాల ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసి గార్డ్ ఆఫ్ ఆనర్​లో గౌరవ వందనం స్వీకరించనున్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని కలెక్టర్లు, జిల్లా కలెక్టర్లు తదగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Next Story