నేడు ఆ రెండు జిల్లాల్లో CM రేవంత్ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే

by Kema Shiva Kumar |

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇవాళ మహబూబ్‌నగర్ (Mahbubnagar), భద్రాద్రి కొత్తగూడం (Bhadradri Kothagudem) జిల్లాల్లో పర్యటించనున్నారు.

నేడు ఆ రెండు జిల్లాల్లో CM రేవంత్ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇవాళ మహబూబ్‌నగర్ (Mahbubnagar), భద్రాద్రి కొత్తగూడం (Bhadradri Kothagudem) జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన ఇవాళ ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండల పరిధిలోని వేములకు బయలుదేరుతారు. అక్కడ ఎస్‌జీడీ టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్ ఫర్నేస్ లైటింగ్ సంస్థ రెండో యూనిట్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం 11.30కి అక్కడి నుంచి బయలుదేరి నేరుగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండకు వెళ్లునున్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. మధ్యాహ్నం 2.30కి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బెందలపాడు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారుని గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం పైలాన్ ఆవిష్కరణతో పాటు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో ముచ్చటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు చంద్రుగొండ మండల పరిధిలోని దామరచర్లలో నిర్వహించే ప్రజా సభలో పాల్గొని సాయంత్రం 4కు తిరిగి చంద్రుగొండలోని హెలిప్యాడ్‌కు బయలుదేరి తిరిగి సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌కు చేరుకుంటారు.

Next Story