- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ నెల 20న కాళేశ్వరంలో సీఎం రేవంత్ పర్యటన.. మేడిగడ్డ బ్యారేజీ పరిశీలన
ఏప్రిల్ 20న కాళేశ్వరంలో ప్రాజెక్ట్ పరిధిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఈనెల 20న కాళేశ్వర ప్రాజెక్టు (Kaleshwaram Project) పరిధిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న మేడిగడ్డ బ్యారేజీ పరిస్థితిని ఆయన స్వయంగా పరిశీలించనున్నారు. గతంలో కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీ పియర్లను సీఎం పరిశీలించి, పునరుద్ధరణ పనుల పురోగతిపై ఇంజనీరింగ్ అధికారులతో చర్చించనున్నారు. అదేవిధంగా కాళేశ్వరంలోని గోదావరి నది వద్ద జరగనున్న సరస్వతి అంత్య పుష్కరాల ఏర్పాట్లపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించనున్నారు.
పర్యటన ముగింపులో ముఖ్యమంత్రి అక్కడ ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టుల భవిష్యత్తుపై ఆయన కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేసేందుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Sridhar Babu) ఇప్పటికే రంగంలోకి దిగారు. జిల్లా ఉన్నతాధికారులు, పోలీసు యంత్రాంగంతో కలిసి భద్రత, సభా ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. సీఎం పర్యటనలో ఎక్కడా లోపాలు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.






