- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రీరామనవమి రోజున ఆ ఇంట్లో CM రేవంత్ లంచ్
సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) పర్యటించారు.

దిశ, వెబ్‌డెస్క్: సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) పర్యటించారు. జిల్లా కేంద్రంలోని రెండో వార్డులో సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్(Collector Tejas Nandalal) కూడా అక్కడే డిన్నర్ చేశారు. అనంతరం మంత్రులు, కలెక్టర్లతో మంత్రి ఉత్తమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అతి త్వరలో 30 లక్షల రేషన్ కార్డులు పంపిణీ చేయబోతున్నట్లు ప్రకటించారు. త్రివర్ణంలో బీపీఎల్ కార్డులు ఉండబోతున్నాయని అన్నారు. గ్రీన్ కలర్‌లో ఏపీఎల్ కార్డులు ఉంటాయని చెప్పారు. వీటి ద్వారా రాష్ట్రంలోని 1.10 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలుగుతుందని అన్నారు. రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులంతా స్థానిక రేషన్ షాపులను తనిఖీ చేయాలని ఆదేశించారు.
లబ్ధిదారుల ఇళ్లలో భోజనం చేయాలని సూచించారు. శ్రీరామనవమి పండుగరోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) భద్రాచలంలో పర్యటిస్తారని.. అదేరోజు సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేస్తారని చెప్పారు. రేషన్ దుకాణాలకు సన్న బియ్యం రవాణా, పంపిణీని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నూతన ఆహార భద్రత రేషన్ కార్డుల దరఖాస్తుల పరిశీలనను త్వరగా పూర్తిచేయాలన్నారు.






