నేడు ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన.. షెడ్యూల్ ఇదే

by Ajay Maddhiboyina |

సీఎం రేవంత్ రెడ్డి నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో సీఎం ఆదిలాబాద్ జిల్లా భోరాజ్ మండలం హతిఘాట్ గ్రామంలోని చనాక కొరాటా పంప్ హౌస్ ప్రారంభించనున్నారు.

నేడు ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన.. షెడ్యూల్ ఇదే
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో సీఎం ఆదిలాబాద్ జిల్లా భోరాజ్ మండలం హతిఘాట్ గ్రామంలోని చనాక కొరాటా పంప్ హౌస్ ప్రారంభించనున్నారు. అనంతరం నిర్మల్ జిల్లా మామడ మండలం పొంకల్ గ్రామంలో సదర్మట్ బ్యారేజీని ప్రారంభించి యాసంగి పంటకు నీటిని విడుదల చేయనున్నారు. తరవాత నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరై ప్రసంగించనున్నారు.

ఈ పర్యటనలో సీఎం ఉమ్మడి జిల్లాలో మొత్తం రూ.386.46 కోట్లతో పలు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేస్తారు. ఇక ఇప్పటికే అధికారులు సీఎం పర్యటన కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు ఈ పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరిస్తుండటంతో ఎక్కడిక్కడ హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ఇదిలా ఉంటే సీఎం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాల పర్యటన మొదలు పెట్టారు. నేడు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న ఆయన రేపు మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు.

Next Story