- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశానికి ప్రగతి బాటలు వేసిన దార్శనికుడు పీవీ.. జయంతి వేళ సీఎం రేవంత్ ట్వీట్
ఆర్థిక సంస్కరణలతో దేశానికి ప్రగతి బాటలు వేసిన దార్శనికుడు, మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు (PV Narasimha Rao) అని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఆర్థిక సంస్కరణలతో దేశానికి ప్రగతి బాటలు వేసిన దార్శనికుడు, మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు (PV Narasimha Rao) అని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఇవాళ ఆయన జయంతిని పురస్కరించుకుని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా నివాళులర్పిస్తూ సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. నాడు పీవీ చేపట్టిన ఆర్థిక సంస్కరణలే నేడు భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు దోహదపడిందని అన్నారు. విద్యా వ్యవస్థలోనూ వినూత్న విధానాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. నవోదయ పాఠశాలలు పీవీ హయాంలోనే ఏర్పాటు అయ్యాయని పేర్కొన్నారు. పీవీ నరసింహారావు స్ఫూర్తితో విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Next Story






