- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: సర్పంచ్ అభ్యర్థులకు CM రేవంత్ స్వీట్ వార్నింగ్
ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) శ్రీకారం చుట్టారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) శ్రీకారం చుట్టారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. గ్రామాన్ని అభివృద్ధి చేసే మంచి వ్యక్తులను సర్పంచ్‌లుగా ఎన్నుకోండి అని పిలుపునిచ్చారు. అభివృద్ధిని అడ్డుకునే వారిని ఎన్నుకోవద్దని సూచించారు. ప్రభుత్వ వ్యతిరేకులను ఎన్నుకున్నా ఉపయోగం ఉండదని సూచించారు. నోరు మంచిదైతే.. ఊరు మంచిదైతదని అన్నారు. సర్పంచ్ అభ్యర్థులు కూడా డబ్బులు అనవసరంగా ఎక్కువ ఖర్చు చేయొద్దని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.
ఆదిలాబాద్ అభివృద్ధి బాధ్యత నాది. ఆదిలాబాద్‌కు ఎయిర్‌పోర్టు ఇచ్చాం.. త్వరలోనే యూనివర్సిటీ ఇస్తాం.. అది ఎక్కడ నిర్మించాలో ఇక్కడి నేతలంతా కలిసి ఓ నిర్ణయం తీసుకోవాలి.. ఇంద్రవెల్లిలో అయితే బాగుంటుందని నా అభిప్రాయం కానీ.. అదే ఫైనల్ కాదు.. స్థలం ఎక్కడో నిర్ణయించాల్సిన బాధ్యత ఉమ్మడి ఆదిలాబాద్ నేతలదే అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ కట్టి తీరుతాం.. ప్రారంభోత్సవానికి నేను వస్తాను.. ఈ ప్రాంతంలో అపారమైన సున్నపు గనులు ఉన్నాయి.. ఇక్కడ సిమెంట్ కంపెనీని మళ్లీ ప్రారంభిస్తాం.. అత్యంత వెనకబడిన ఆదిలాబాద్‌ను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటా అని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.






