- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వీగిన మహిళా రిజర్వేషన్ బిల్లు: సీఎం రేవంత్ రెడ్డి సంచలన ట్వీట్
లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఒక పోస్ట్ చేస్తూ, కేంద్ర ప్రభుత్వ తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ స్ఫూర్తిని, దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడుకోవడంలో ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు. "మహిళా రిజర్వేషన్ల ముసుగులో దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కేందుకు కేంద్రం పన్నిన డీలిమిటేషన్ కుట్రను ప్రజాస్వామ్య శక్తులు సమర్థవంతంగా అడ్డుకున్నాయి. ఇది కేవలం ఒక బిల్లు వీగిపోవడం కాదు.. సమాఖ్య స్ఫూర్తికి దక్కిన విజయం" అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాజ్యాంగ సవరణల పేరుతో దేశ రాజకీయ సమతుల్యతను దెబ్బతీసేందుకు ఏ శక్తులు ప్రయత్నించినా, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వాటిని తిప్పికొడుతుందని ఈ ఓటింగ్ నిరూపించిందని ఆయన అభిప్రాయపడ్డారు.
మహిళా కోటాపై స్పష్టత..
మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ ఎప్పుడూ వ్యతిరేకం కాదని, అయితే వాటిని డీలిమిటేషన్, కులగణనతో ముడిపెట్టి కాలయాపన చేయడాన్ని తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. విపక్ష 'ఇండియా' కూటమి ఎంపీలు ఐక్యంగా నిలబడి, తెలంగాణ వంటి అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడారని ఆయన కొనియాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి నుంచీ డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు జరిగే అన్యాయంపై గళం విప్పుతున్నారు. జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలను శిక్షించేలా సీట్ల పెంపు ఉండకూడదని ఆయన వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో బిల్లు వీగిపోవడాన్ని ఆయన తన రాజకీయ విజయంగా కూడా భావిస్తున్నారు.






