- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘నీ గుండెలపై రాసి పెట్టుకో’.. కేసీఆర్‌కు CM రేవంత్ సంచలన సూచన
గుండెల్లో పెట్టి చూసుకున్న పాలమూరు గడ్డకు కేసీఆర్(KCR) ఇచ్చింది ఏంటి? అనేది సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) డిమాండ్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: గుండెల్లో పెట్టి చూసుకున్న పాలమూరు గడ్డకు కేసీఆర్(KCR) ఇచ్చింది ఏంటి? అనేది సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) డిమాండ్ చేశారు. శుక్రవారం నాగర్ కర్నూలు సభలో ఆయన మాట్లాడుతూ.. 98 జీవో ప్రకారం పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ నిర్వాసితులను ఎందుకు ఆదుకోలేదు? అని ప్రశ్నించారు. వాల్మీకి సోదరులను ఎస్టీ బోయలుగా మారుస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశారని గుర్తుచేశారు. పదేళ్లలో ఈ సమస్యలను పరిష్కరించి ఉంటే పాలమూరు వాసులు మళ్లీ సమస్యపై కొట్లాడే పరిస్థితి ఉండేది కాదని అన్నారు. ప్రజాపాలన చూసి కేసీఆర్‌కు దుఃఖం వస్తోందని విమర్శించారు.
‘పాలమూరు-రంగారెడ్డిని పూర్తి చేయలేదు. కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా ప్రాజెక్టులు చేయలేదు. లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం మూడేళ్లల్లో కూలేశ్వరం అయింది. కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదన్నారు.. కానీ రైతులకు 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్నాం.. వరికి బోనస్ ఇచ్చి ప్రతీ గింజ కొంటున్నాం.. మొదటి ఏడాదిలోనే రూ.21 వేల కోట్లతో రైతులకు రుణమాఫీ చేశాం.. 9 రోజుల్లో 9 వేలకోట్లు రైతుభరోసా ఇచ్చాం.. స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించి వారికి రుణాలు అందిస్తున్నాం.. అమ్మ ఆదర్శ పాఠశాలల నిర్వహణ బాధ్యత వారికే అప్పగించాం.. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌లను ఏర్పాటు చేసి ఆడబిడ్డల్ని వ్యాపారాల్లో ప్రోత్సహిస్తున్నాం.. సోలార్ ప్లాంట్ ఏర్పాటు, పెట్రోల్ బ్యాంకుల ఏర్పాటుకు ప్రోత్సహించి అంబానీ, అదానీతో పోటీ పడేలా ఆడబిడ్డలకు అప్పగించాం.. 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం.. ఇలా మొదటి ఏడాదిలోనే ఎన్నో పనులు చేశాం. కేసీఆర్ నీ గుండెలపై రాసి పెట్టుకో.. 2034 వరకు ఈ పాలమూరు బిడ్డే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటాడు.. పాలమూరు గడ్డ నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తాడు’ అని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.






