- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘అలా ఆలోచించి ఉంటే ఇంకా టీడీపీలోనే ఉండేవాడిని’.. CM రేవంత్ సంచలన వ్యాఖ్యలు
రైతుభరోసా(Rythu Bharosa) విజయోత్సవ సభను మంగళవారం తెలంగాణ సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహ ఆవరణలో ఏర్పాటు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: రైతుభరోసా(Rythu Bharosa) విజయోత్సవ సభను మంగళవారం తెలంగాణ సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహ ఆవరణలో ఏర్పాటు చేశారు. ఈ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాట్లాడుతూ.. తెలంగాణలో వ్యవసాయం(Agriculture) దండగ అనే పరిస్థితి నుంచి పండుగ అనే స్థితికి తీసుకొచ్చామని అన్నారు. తాము రైతులను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నామని తెలిపారు. తమ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత రైతులే అని స్పష్టం చేశారు. అందుకే ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. రూ.2 లక్షల రుణమాఫీ చేసి చూపించామని అన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రూ.20,600 కోట్లతో రుణమాఫీ చేశామని చెప్పారు. గతంలో వరి వేస్తే ఉరి వేసుకున్నట్లే అని కేసీఆర్(KCR) చెప్పారు.. కానీ మేము వరి వేసే రైతులను ప్రొత్సహించడంతో పాటు సన్నాలకు బోనస్ కూడా ఇచ్చామని అన్నారు. 70 లక్షల కుటుంబాలకు రైతు భరోసా పథకం వర్తింపజేసినట్లు వెల్లడించారు. 9 రోజుల్లోనే రైతుభరోసా నగదు బదిలీ చేశామని అన్నారు.
తెలంగాణ రాకముందు కేసీఆర్ కుటుంబం ఆస్తి ఎంత?, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత పదేళ్లలో పెరిగిన కేసీఆర్ ఆస్తి ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని పదేళ్ల పాటు నిలువునా దోచుకున్నారని మండిపడ్డారు. రైతుబంధు నిధులు కూడా అడ్డంగా మింగారని సీరియస్ అయ్యారు. పదేళ్ల బీఆర్ఎస్(BRS) పాలనలో ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలని నిరుద్యోగులు ఉద్యమాలు చేసేవారు.. ఇప్పుడు తాము నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే.. కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇలాంటి శకుని మామ(కేసీఆర్), శనీశ్వరుడైన అల్లుడు(హరీష్ రావు) తమను ప్రశ్నిస్తున్నారని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ కుట్రలతోనే తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణాలు ఆగిపోయాయని అన్నారు. సీమాంధ్ర పాలకులతో కలిసి తెలంగాణను ఎడారి చేశారని మండిపడ్డారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో తాను ఏనాడూ రాజీపడబోనని స్పష్టం చేశారు. చంద్రబాబుతో ఉండాలనుకుంటే ఇంకా టీడీపీలోనే ఉండేవాడిని.. తెలంగాణ అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌లోకి వచ్చానని చెప్పారు. తెలంగాణ కోసం ఎవరినైనా ప్రశ్నిస్తానని అన్నారు. గోదావరి జలాలపై అసెంబ్లీలో చర్చ పెడితే కేసీఆర్ వస్తారా? అని ప్రశ్నించారు. చేసిన తప్పులకు మొఖం చెల్లకనే ఫామ్‌హౌజ్ నుంచి కేసీఆర్ బయటకు రావడం లేదని విమర్శించారు. రైతుబంధు ఇచ్చేందుకు భూములు అమ్మారు. రుణమాఫీ కోసం ఔటర్ రింగ్ రోడ్ భూములు అమ్మారు. ఇప్పుడేమో మాకు నీతులు చెబుతున్నారని సీరియస్ అయ్యారు.






