- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM Revanth: మావోయిస్టుల లొంగుబాట్లపై అసెంబ్లీలో ప్రకటన చేస్తా
మావోయిస్టు పార్టీ మాజీ అగ్రనేతలతో సచివాలయం వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: మావోయిస్టు పార్టీ మాజీ అగ్రనేతలతో సచివాలయం వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమావేశం అయిన సంగతి తెలిసిందే. భేటీ అనంతరం సీఎం రేవంత్ మీడియాతో మాట్లాడారు. జనజీవన స్రవంతిలోకి వచ్చిన తర్వాత చట్ట పరిధిలో వారు ఏదైనా చేసుకోవచ్చు. చట్టాలు ఉల్లంఘిస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. మావోయిస్టుల లొంగుబాట్లపై అసెంబ్లీలో ప్రకటన చేస్తానని వెల్లడించారు. ఇదిలా ఉంటే.. పొలిటికల్ ఎజెండాపైన పలు రకాలుగా దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి, నూనె నరసింహారెడ్డి, సుజాతక్క, దామోదర్, చంద్రన్నలు సీఎం రేవంత్‌తో చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఏడీజీ విజయ్ కుమార్, స్పెషల్ బ్రాంచీ ఐజీ సుమతి పాల్గొన్నారు. గతంలో సచివాలయంలోకి మాజీ మావోయిస్టులకు ఎంట్రీ ఉండేది కాదు. కానీ, తాజాగా మాజీ మావోయిస్టు నేతలకు సచివాలయంలోకి సాదర స్వాగతం పలకడం ప్రాధాన్యత సంతరించుకుంది.






