దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వండి.. కేంద్రానికి సీఎం రేవంత్ ప్రతిపాదన

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-23 12:54:25  IST  )

ఉపరాష్ట్రపతి జగదీప్ దన్‌ఖడ్ ఇటీవలే తన పదవికి రాజీనామా చేయడంతో.. ఆ స్థానానికి ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది.

దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వండి.. కేంద్రానికి సీఎం రేవంత్ ప్రతిపాదన
X

దిశ, వెబ్‌డెస్క్: ఉపరాష్ట్రపతి జగదీప్ దన్‌ఖడ్ ఇటీవలే తన పదవికి రాజీనామా చేయడంతో.. ఆ స్థానానికి ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది. ఈ మేరకు లోక్‌సభ, రాజ్యసభలోని ఎలక్టోరల్‌ కాలేజీ ఎంపీలను సంప్రదిస్తోంది. రిటర్నింగ్‌ ఆఫీసర్ల పేర్లను ఖరారు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. మరో నెల రోజుల్లో ఉప రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రానికి కీలక ప్రతిపాదన చేశారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుత హర్యానా గవర్నర్, తెలంగాణకు చెందిన బండారు దత్తాత్రేయకు ఉప రాష్ట్రపతి పదవి ఇవ్వాలని కేంద్రానికి సూచించారు. ఆయనకు ఆ పదవి కట్టబడితే బీసీలందికీ న్యాయం చేసినట్లు అవుతుందని అన్నారు. తెలుగు వారికి సరైన గౌరవం దక్కుతుందని తెలిపారు. తాను ఇండియా కూటమి తరపున మాట్లాడటం లేదని.. తెలంగాణ ప్రజల తరఫున తన అభిప్రాయాన్ని చెప్పానని అన్నారు. బండారు దత్తాత్రేయను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తే.. తాను ఇండియా కూటమితో మాట్లాడుతా సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు.

Next Story