హైదరాబాద్‌ను కాలుష్యరహితంగా తీర్చిదిద్దాలి.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

by Kema Shiva Kumar |

హైదరాబాద్ మహానగర అభివృద్ధిపై మున్సిపల్ శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బంజారా హిల్స్‌లోని కంట్రోల్ కమాండ్ సెంటర్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు.

హైదరాబాద్‌ను కాలుష్యరహితంగా తీర్చిదిద్దాలి.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహానగర అభివృద్ధిపై మున్సిపల్ శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బంజారా హిల్స్‌లోని కంట్రోల్ కమాండ్ సెంటర్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో భాగంగా హైదరాబాద్ (Hyderabad) నగరాన్ని కాలుష్యరహితంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన సంస్కరణలు తీసుకురావాలని అధికారులకు ఆయన సూచించారు. అదేవిధంగా రాబోయే 25 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. నగర వ్యాప్తంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, విద్యుత్ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కోర్ అర్బన్ రీజియన్‌ (Core Urban Region)లో కాలుష్య నియంత్రణకు శాశ్వత పరిష్కారం చూపాలని అన్నారు. అందుకు సంబంధించి దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ (Delhi), బెంగుళూరు (Bengaluru), చెన్నై (Chennai) లాంటి నగరాల్లో సమస్యలను అధ్యయనం చేయాలని తెలిపారు. హైదరాబాద్‌కు ఢిల్లీ పరిస్థితి రాకుండా పరిష్కార మార్గాలను సిద్ధం చేయాలని.. అందుకు మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.

Next Story