- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ వచ్చాక క్రీడా స్ఫూర్తి తగ్గింది: CM రేవంత్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో తెలంగాణ శాసన సభ్యుల స్పోర్ట్స్ మీట్-2026 తొలి ఎడిషన్ ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో తెలంగాణ శాసన సభ్యుల స్పోర్ట్స్ మీట్-2026 తొలి ఎడిషన్ ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడొత్సవాలు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ‘మా కేబినెట్‌లో అద్భుతమైన క్రీడాకారులు ఉన్నారు. వారిలో ఉన్న ప్రతిభను ప్రదర్శించే అవకాశం మరోసారి వచ్చింది. ప్రజా జీవితంలో ఉన్నవారికి క్రీడలు ఉపశమనంగా ఉపయోగపడతాయి. వారంతా ఇవాళ మంచి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తారని ఆశిస్తున్నా. ఒకప్పుడు తెలంగాణ క్రీడల రాజధానిగా ఉండేది. ఆ తర్వాత రాష్ట్రంలో సుదీర్ఘ కాలంగా క్రీడాపోటీలు నిర్వహించలేదు. తెలంగాణ వచ్చాక క్రీడా స్ఫూర్తి తగ్గింది’ అని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
మెస్సీ ప్రస్తావన..
ప్రపంచ ఫుట్‌బాస్ దిగ్గజం లియోనల్ మెస్సీని హైదరాబాద్‌కు తీసుకొస్తే వివాదం చేశారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. నగరాన్ని గ్లోబల్ స్పోర్ట్స్ హబ్‌గా మార్చే ప్రయత్నాలను రాజకీయ కోణంలో చూడటం బాధాకరమని పేర్కొన్నారు. హైదరాబాద్ అంటే కేవలం బిర్యానీ, ఐటీ మాత్రమే కాదు.. క్రీడలకు కూడా కేరాఫ్ అడ్రస్ అని ప్రపంచానికి చాటిచెప్పేందుకే మెస్సీని ఆహ్వానించాం. కానీ కొందరు దీనిని తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకున్నామని విమర్శించడం దురదృష్టకరం అని రేవంత్ రెడ్డి అన్నారు. కోల్‌కతా వంటి నగరాల్లో మెస్సీ పర్యటన గందరగోళంగా ముగిసినా, హైదరాబాద్‌లో మాత్రం అత్యంత క్రమశిక్షణతో, విజయవంతంగా నిర్వహించామని సీఎం గుర్తు చేశారు. ఇది తెలంగాణ ఆతిథ్యానికి మరియు సమర్థతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.






