- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: కొత్త జిల్లాల ఏర్పాటు, పాత జిల్లాల రద్దుపై CM రేవంత్ కీలక ప్రకటన
తెలంగాణ సాధణలో తొలి, మలిదశ ఉద్యమాల్లో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల పాత్ర కీలకం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ సాధణలో తొలి, మలిదశ ఉద్యమాల్లో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల పాత్ర కీలకం అని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. నల్లబంగారాన్ని వెలికి తీస్తున్న సింగరేణి కార్మికులు దేశానికి ఆదర్శం అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు గొప్ప చరిత్ర ఉంది. భూపాలపల్లి కుగ్రామంగా ఉన్న సమయంలో అన్న నందమూరి తారకరామరావు మొట్టమొదట దీన్ని మండల కేంద్రంగా మార్చి సింగరేణి బొగ్గు ఉత్పత్తికి మొట్టమొదటి పునాది రాయి వేశారు. దాంతో ఆ తర్వాత భూపాలపల్లి వెనక్కి తిరిగి చూడలేదు. ఇప్పుడు భూపాలపల్లి జిల్లా కేంద్రంగా, మున్సిపాలిటీగా అభివృద్ధి చెందింది. దీనికి కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి అన్నారు. భూపాలపల్లి జిల్లాను కాంగ్రెస్ పార్టీ రద్దు చేయబోతోందని ఇటీవల కొంతమంది విషపు ప్రచారం చేస్తున్నారు. ఈ వేదిక నుంచి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు చెబుతున్నాను. ఏ జిల్లాను తొలగించడం, కొత్త జిల్లాను ఇచ్చే ఆలోచన ప్రభుత్వ పరిశీలనలో లేదని స్పష్టం చేశారు. ఎప్పుడైనా జిల్లాల పునర్విభజనపై ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే బహిరంగంగా ప్రజలకు చెప్పి, శాసనసభలో చర్చ చేసి ప్రతిపక్షాల సూచన తీసుకున్న తర్వాతే జిల్లాలపై ఆలోచన చేస్తామన్నారు. ఎవరి ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని అపోహాలు సృష్టించాలని ప్రయత్నాలు చేసినా భూపలపల్లి జిల్లా ఎక్కడికి పోదన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూర్‍లో ఆదివారం ఆయన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం 'ప్రజాపాలన-ప్రగతి బాట' సభలో పాల్గొని మాట్లాడారు.
మెడికల్ బోర్డు ఆలోచన లేదు:
కొందరు చిల్లర మల్లర ప్రయత్నాలు, తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం విషం చిమ్మడం తప్పా వాళ్లు చేయగలిగిన ప్రయత్నమేమి లేదన్నారు. సింగరేణి కార్మికుల విషయంలో మెడికల్ బోర్డు విషయంలో విషం చిమ్ముతున్నారని ఇలాంటి వారిని మోకాళ్లపై కూర్చొబెడుతామని ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మెడికల్ బోర్డు ఆలోచన ప్రభుత్వ ఆలోచనలో లేదన్నారు. సింగరేణి కార్మికుల వల్లే ప్రజాప్రభుత్వం అధికారంలో ఉంది. అలాంటి సింగరేణి కార్మికులకు నష్టం చేసే ఏ పనిని ఈ ప్రభుత్వం చేయదన్నారు. డిస్మిస్ కార్మికులు 217 మంది ఉన్నారని నా దృష్టికి వచ్చింది. ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తుందన్నారు.






