CM Revanth Reddy : జొన్న రొట్టె కందిపప్పు తింటే సిక్స్ ప్యాక్ : సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Muthe.Rajitha |

ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో సోమవారం జరుగుతున్న రైతు నేస్తం(Raithu Nestam) కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy ) పాల్గొన్నారు.

CM Revanth Reddy : జొన్న రొట్టె కందిపప్పు తింటే సిక్స్ ప్యాక్ : సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో సోమవారం జరుగుతున్న రైతు నేస్తం(Raithu Nestam) కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy ) పాల్గొన్నారు. వివిధ జిల్లాలకు చెందిన రైతులతో ముఖాముఖి ప్రోగ్రాంలో మాట్లాడి.. వారి విజయాలను, వినతులను విన్నారు. అయితే ఈ కార్యక్రమంలో రైతులు పేర్కొన్న కూరగాయల సాగు మీద మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోజూ జొన్న రొట్టె తింటే జిమ్ కు వెళ్ళకుండానే సిక్స్ ప్యాక్ బాడీ వస్తుందని పేర్కొన్నారు. ఇప్పుడంతా ఏదో డైట్ అంటూ అడ్డమైన గడ్డి తింటున్నారని, రోజూ జొన్న రొట్టె తింటూ, ఎవరి బట్టలు వారే ఉతుక్కుంటే జిమ్ములకు వెళ్ళి కండలు పెంచాల్సిన అవసరం ఉండదని యువతకి సలహా ఇచ్చారు.

అచ్చంపేటలో పండించే దోసకాయ కందిపప్పు కలిపి వండి తింటే బ్రహ్మాండంగా ఉంటుందన్నారు. వాటి మీదికి చికెన్, మటన్ కూడా పనికి రాదు అన్నారు. ఆ రుచులు ఇప్పుడు లేవని, అన్ని పంటలు మారిపోయాయని వెల్లడించారు. కాగా ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రైతు భరోసా నిధులను రైతుల అకౌంట్లలోకి విడుదల చేశారు.

Next Story