ఆ రెండు సీట్లు కూడా గెలిచి ఉంటే.. పరిస్థితి వేరేలా ఉండేది: CM రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

బీఆర్ఎస్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మరోసారి రెచ్చిపోయారు. శుక్రవారం నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండలం జటప్రోల్‌లో‌ పర్యటించారు.

ఆ రెండు సీట్లు కూడా గెలిచి ఉంటే.. పరిస్థితి వేరేలా ఉండేది: CM రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మరోసారి రెచ్చిపోయారు. శుక్రవారం నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండలం జటప్రోల్‌లో‌ పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగించారు. పాలమూరు జిల్లా అంటేనే కల్వకుంట్ల కుటుంబానికి చిన్నచూపు అని మండిపడ్డారు. అలాంటి కేసీఆర్‌(KCR)కు ఒకనాడు పాలమూరు బిడ్డలే రాజకీయ భిక్ష పెట్టారని మర్చిపోయారని సీరియస్ అయ్యారు. కరీంనగర్ ప్రజలు ఓడించడానికి సిద్ధమైతే.. కేసీఆర్ పాలమూరుకు వలస వచ్చారని గుర్తుచేశారు. అప్పుడు పాలమూరు బిడ్డలే అక్కున చేర్చుకుని పార్లమెంట్‌కు పంపించారని అన్నారు. అయినా.. ఆయన జిల్లాకు చేసింది ఏమీ లేదని తెలిపారు. వాల్మికీలను ఎస్టీ జాబితాలో చేర్పిస్తామని హామీ ఇచ్చి.. కేసీఆర్ విస్మరించారని అన్నారు. పాలమూరు జిల్లా అంటే.. ఓ భావోద్వేగంతో ముడిపడి ఉంటుందని అన్నారు. ఇప్పుడు పాలమూరు బిడ్డే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడని.. జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసే బాధ్యత తనదే అని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ముఖ్యంగా కొల్లాపూర్‌కు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని 14 అసెంబ్లీ స్థానాల్లో 12 గెలిచాం.. ఇంకో రెండు కూడా గెలిచి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. జిల్లాకు మరో మంత్రి పదవి కూడా వచ్చేది అని అన్నారు. అయినా కూడా ఎక్కడా పార్టీలు చూడకుండా అన్ని నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. అభివృద్ధి చూసి కేసీఆర్ కడుపుమంటతో ఉన్నారని విమర్శించారు. మాదిగ కులాల వర్గీకరణ చేసినందుకు కేసీఆర్ తట్టుకోలేకపోతున్నారని అన్నారు. కేసీఆర్ మనవడితో పాటు మాదిగల పిల్లలు కూడా మెడిసిన్ చదువుతుంటే ఓర్వలేకపోతున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Next Story