అందెశ్రీపైనా కుట్ర చేశారు.. సంతాపసభలో CM రేవంత్ హాట్ కామెంట్స్

by Gantepaka Srikanth |

అందెశ్రీపైనా కుట్ర చేశారు.. సంతాపసభలో CM రేవంత్ హాట్ కామెంట్స్

అందెశ్రీపైనా కుట్ర చేశారు.. సంతాపసభలో CM రేవంత్ హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని రవీంద్రభారతీలో నిర్వహించిన అందెశ్రీ(Andesri) సంతాపసభలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ సమాజం చైతన్యవంతమైన సమాజం అని అన్నారు. తెలంగాణ ప్రజలు అమాయకంగా కనిపిస్తారు కానీ.. అమాయకులు కాదని చెప్పారు. ఈ గడ్డ మీద పుట్టిన ఎవరూ ఆధిపత్యాన్ని, అహంకారాన్ని సహించరు అని అన్నారు. నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ ఎంతోమంది కవులు, కళాకారులు తమ ఆట, పాటలతో ప్రజల్లో చైతన్యం కలిగించారని చెప్పుకొచ్చారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కవులు, కళాకారులదే కీలక పాత్ర అని కొనియాడారు. వాళ్లు తీసుకొచ్చిన ఊపుతోనే తెలంగాణ కల సాకారమైందని అన్నారు. ఎన్నడూ బడికి వెళ్లని అందెశ్రీ తెలంగాణ ‘అద్భుతమైన జయజయహే తెలంగాణ’ గీతాన్ని అందించారని స్మరించుకున్నారు. ముఖ్యంగా అందెశ్రీ లేని తెలంగాణ ఉద్యమన్నా ఊహించుకోలేమని అన్నారు. ఆయన పాటలు తెలంగాణ ప్రజలను ఎంతో ఉత్తేజపరిచాయని వెల్లడించారు. ఉద్యమ సమయంలో ఆయన పాటలు మార్మోగాయని.. అదే సమయంలో ఉద్యమంలో ఆయన పాత్ర లేకుండా చేయాలని కూడా కొందరు కుట్ర చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు రెండు కళ్ల లాంటి వారైన అందెశ్రీ, గద్దర్ కుటుంబాలకు ప్రజాప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

తాము అధికారంలోకి రాగానే జయజయహే గీతాన్ని రాష్ట్రగీతంగా ప్రకటించాం.. ప్రతీ పాఠ్యపుస్తకంలో గీతాన్ని చేర్చామని చెప్పారు. కవులు, కళాకారులు, దళితులు అందరినీ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన తొలి రాష్ట్రం తెలంగాణే అని ఈ సందర్భంగా గుర్తుచేశారు. చదువుల్లోనే కాదు.. విద్య, ఉద్యోగం, రాజకీయాల్లోనూ ఎస్సీల ప్రాతినిధ్యం పెరగాలని.. అందుకు ప్రజాప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది.. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటుందని అన్నారు. మంత్రివర్గంలోనూ ఎస్సీలకు సముచిత స్థానం ఇచ్చినట్లు గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ఉద్యమం గురించి ఎక్కడ చర్చ వచ్చినా.. కోహినూర్ వజ్రంలా అందెశ్రీ గురించి చర్చ జరుగుతుందని తాను విశ్వసిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

Next Story